మరింత క్షీణించిన రూపాయి, డాలర్‌తో 27 పైసలు తగ్గుదల
న్యూఢిల్లీ: రూపాయి మరింత బలహీనపడింది. మంగళవారం నాడు కొద్దిగా రూపాయి పుంజుకొన్నట్టుగా కన్పించినా బుధవారం నాడు మరోసారి మరింత కనిష్ట స్థాయికి చేరుకొంది. ఆరంభం నుండి నష్టాల నుండి ఏ మాత్రం కోలుకోలేదు.
అంతేకాదు మూడు మాసాల కనిష్ట స్థాయికి చేరుకొంది. డాలర్ డాలర్ మారకంలో రూపాయి 67 మార్క్‌కు పడిపోవడానికి దగ్గరలో ఉంది. సుమారు 0.41 పైసలు క్షీణించి 66.08 వద్దకు చేరుకొంది.

దిగుమతిదారుల నుండి నెలవారీ డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో అమెరికా డాలర్‌తో పోల్చుకొంటే రూపాయి మరింతగా బలహీనపడిందని నిపుణులు చెబుతున్నారు.
ద్రవ్యలోటు పెరగడంతో రూపాయిపై ఒత్తిడి ఇప్పటికే కొనసాగుతోందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఐఐ అమ్మకాలు కొనసాగడంతో, బలహీనమైన స్టాక్ మార్కెట్ల ప్రభావం కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications