రూపాయి కథ ఖల్లాస్

అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూ వస్తోంది. నాలుగో వారంలోకి ప్రవేశించిన తర్వాత కూడా దీనికి బ్రేకులు పడట్లేదు. ఈ పరిణామాలు భారత్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. నేడు రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యప్రాచ్య యుద్ధ ఆందోళనల మధ్య రూపాయి 95 మార్కును దాటింది. 95. 20 పైసలకు చేరింది. రెండు రోజుల కిందటే 94.26 పైసల వద్ద నిలిచింది. ఈ కనిష్టాన్ని అధిగమించింది.

గత నెల చివర్లో యుద్ధం మొదలైనప్పటి నుండి, భారత కరెన్సీ సుమారు 4.4 శాతం మేర బలహీనపడింది. యుద్ధ ప్రభావం దేశీయ కరెన్సీ మీద ఏ స్థాయిలో పడిందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, సహజవాయువు ఇంధన సరఫరా సంక్షోభం కొనసాగుతోండటం, అంతర్జాతీయంగా డాలర్ బలపడటం వంటి పరిణామాలు రూపాయి పతనానికి ప్రధాన కారణం అయ్యాయి. మధ్యప్రాచ్య సంఘర్షణ చమురు సరఫరా అంతరాయాలు దీర్ఘకాలం కొనసాగవచ్చనే భయాలను రేకెత్తించింది.

Rupee Slips to Fresh Record Low at 95 20 Against the Dollar depreciated 4 4 Percent March quarter

బ్యారెల్‌కు 115 పైన చమురు ధరల స్థిరత్వం ప్రపంచ మార్కెట్లలో ఆందోళనలు పెంచింది. దీని ప్రభావం కరెన్సీలనే కాకుండా గ్లోబల్ ఈక్విటీలు, బాండ్ మార్కెట్లపై కూడా పడింది. స్టాక్ మార్కెట్లు ఒత్తిడిని చూడగా, బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై పెట్టుబడిదారుల ఆందోళనకు ఇది అద్దం పట్టింది. దీంతో పాటు రాబోయే 12 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచవచ్చని భావిస్తున్నారు.

అంతర్జాతీయ పరిణామాలు, నిరంతర విదేశీ నిధుల ప్రవాహాలు రూపాయిపై ఒత్తిడిని కొనసాగించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే బ్యాంకులకు విదేశీ మారకపు స్థానాలపై పరిమితులను కఠినతరం చేసింది. ప్రతి పని దినం ముగిసేలోపు నికర ఓపెన్ రూపాయి స్థానాలను 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 10 నాటికి ఈ నిబంధనకు కట్టుబడి ఉండాలని సూచించింది. కరెన్సీ మార్కెట్‌లో అస్థిరతను పరిమితం చేయడమే దీని ఉద్దేశం.

ఈ ఆదేశాల నేపథ్యంలో బ్యాంకులు తమ ఆర్బిట్రేజ్ లావాదేవీలను నిలిపివేసి, దేశీయ మార్కెట్‌లో డాలర్లను విక్రయించే అవకాశం ఉంది. అయినప్పటికీ- రూపాయం పతనానికి బ్రేకులు పడట్లేదు. ఆర్‌బీఐ చర్యలు స్వల్పకాలిక ఊరటను మాత్రమే ఇచ్చాయనేది తాజా పతనంతో స్పష్టమౌతోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో నిధుల ప్రవాహాలు, ముడి చమురు ధరలు అధికంగా ఉండటం రూపాయి విలువను దెబ్బతీశాయి. గత బుధవారం 93.96 వద్ద రూపాయి విలువ ముగియగా.. శుక్రవారం నాటికి దీని పతనం 94.29కి చేరింది.

ఇప్పుడు ఏకంగా 91 పైసల మేర పతనం నమోదుచేసింది. కొద్ది రోజుల కిందటే 91 రూపాయల మార్క్ ను దాటింది రూపాయి విలువ.. అతి తక్కువ సమయంలోనే 95 రూపాయలను దాటడం అత్యంత ఆందోళనకరం. అంతర్జాతీయ లావాదేవీలన్నీ కూడా డాలర్ మీదే ఆధార పడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ ఈ స్థాయికి పతనం కావడం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తడిలోకి నెట్టినట్టవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+