2018లో బడ్జెట్: నిధుల కేటాయింపులు పెంచండి.. ఆర్థికశాఖకు వ్యవసాయ శాఖ అప్పీల్

న్యూఢిల్లీ: వివిధ విభాగాల్లో సేవలు బలోపేతం చేసేందుకు తమకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనల్లో అదనంగా రూ.21,700 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థికశాఖకు గ్రామీణాభివ్రుద్దిశాఖ కార్యదర్శి అమర్జిత్ సిన్హా లేఖ రాశారు. సవరించిన అంచనాలు ఎల్లవేళలా బడ్జెట్ కేటాయింపులతో సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

'మేం అదనంగా రూ.21,700 కోట్లు కేటాయించాలని కోరాం. ఇది సవరించిన బడ్జెట్ అంచనాలకు అధికం. నాబార్డు ద్వారా రుణం తీసుకునేందుకు ఆర్థికశాఖ మాకు వెసులుబాటు కలిగించింది. గత ఏడాది కంటే ఎక్కువగా నిధులు కేటాయించాలని భావిస్తున్నాం. కానీ వ్యవసాయశాఖకు ఎన్నినిధులు కేటాయిస్తారన్నది బడ్జెట్ డే నాడే తెలుస్తుంది' అమర్జిత్ సిన్హా తెలిపారు.

Rural Development Ministry Seeks Extra Rs 21,700 Crore in Union Budget 2018

2018 - 19లో రూ.1.38 లక్షల కోట్లు అవసరం
2017 ఆగస్టు 10 తేదీ నాటికి ఆర్థిక శాఖ రూపొందించిన 'మధ్య తరహా వ్యయం ప్రేం వర్క్ (ఎంటీఈఎఫ్) నివేదిక ప్రకారం ద్రవ్య నియంత్రణ, బడ్జెట్ యాజమాన్య చట్టం 2003కి అనుగుణంగా 2016 - 17లో సవరించిన మేరకు గ్రామీణాభివ్రుద్ది శాఖకు రూ.1,14,747 కోట్ల నుంచి రూ.1,28,320 కోట్లు అవసరమని నిర్ధారించారు. కానీ సవరించిన అంచనా మేరకు కేటాయింపులు ఏనాడూ జరుగలేదని వ్యవసాయ శాఖ కార్యదర్శి అమర్జిత్ సిన్హా చెప్పారు. ఎంటీఈఎఫ్ తాజాగా 2018 - 19లో రూ.1,38,082 కోట్లు అవసరమని, 2019 - 20లో రూ.1,53,939 కోట్లు కేటాయించాలని అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో గెలుపొందాలంటే బీజేపీకి గ్రామీణాభివ్రుద్ధిశాఖ కీలకం.

దేశవ్యాప్తంగా 1.5 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక
దీనికి అదనంగా ప్రధానమంత్రి అవాస్ యోజన (పీఎంఏవై) కింద జరిగిన కేటాయింపుల కంటే ఈ ప్రతిపాదనలు అదనం. పీఎంఏవై కింద గ్రామీణాభివ్రుద్ధిశాఖ దేశవ్యాప్తంగా 1.5 కోట్ల ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం. ప్రారంభ దశలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తయ్యాకే ఈ 1.5 కోట్లు నిర్మాణ ప్రణాళిక రూపొందించడం గమనార్హం. 2022 నాటికి ఇల్లులేని నిరుపేద కుటుంబాలకు 4.33 లక్షల నూతన ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అమర్జిత్ సిన్హా చెప్పారు.

Rural Development Ministry Seeks Extra Rs 21,700 Crore in Union Budget 2018

ఇళ్ల నిర్మాణంలో గుజరాత్, మధ్యప్రదేశ్, బెంగాల్ ముందంజ
గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు పేదలకు ఇళ్ల నిర్మాణంలో మొదటి స్థానంలో నిలిచాయి. ఇక నిత్యం వరదలతో యుద్ధం చేస్తున్న అసోం మాత్రం ఇళ్ల నిర్మాణం నెమ్మదిగా సాగుతోంది. 2011 సామాజిక ఆర్థిక, కుల గణనకు అనుగుణంగా రూపొందించిన డేటా ప్రకారం పేదలకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియ జరిగింది. ప్రతి గ్రామంలోనూ గ్రామసభ అర్హులను ఎంపిక చేసి మరీ ఇళ్ల కేటాయింపులు చేసింది కేంద్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+