వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డు: 36 వేల పైన సెన్సెక్స్, 100 పాయింట్ల లాభంతో నిఫ్టీ

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: దలాల్ స్ట్రీట్ లాభాల బాటలో పయనిస్తోంది. సూచీలు కొత్త చరిత్ర నిర్మిస్తున్నాయి. సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తున్నాయి. మంగళవారంనాటి ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు అద్భుతాలను చూసిదంది.

మార్కెట్ చరిత్రలో తొలిసారి జాతీయ స్టాక్ ఎక్స్‌చేధీ నిప్టీ 11 వేల మైలు రాయిని, బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజీ సెన్సెక్స్ 36వేల మైలురాిని దాటాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్, ఐటి, టెలికాం తదితర రంగాలకు చెందిన కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెద్ద యెత్తున వచ్చి పడ్డాయి. మార్కెట్ సెంటిమెంట్‌కు కలసి వచ్చింది.

Sensex breaches 36,000 mark, Nifty trades above 11,000 level

ప్రారంభం నుేచ సూచీలు రికార్డు బాట పట్టాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే నిప్టీ 11 వేల బెంచ్ మార్కును దాటింది. మంగళవారంనాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 342 పాయింట్ల లాభంతో 36,140 వద్ద, నిఫ్టీ ఒక శాతం పెరిగి 117 పాయింట్లు ఎగబాకి 11,084 వద్ద స్థిరపడ్డాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.63.81గా కొనసాగింది. ఎన్ఎస్ఈలో వేదాంత లిమిటెడ్, గెయిల్, ఎస్‌బిఐ, హిందాల్కో, టాటా స్టీల్ షేర్లు రాణించాయి. ఒక్కో కంపెనీ వాటా విలువ సగటున 3 నుంచి 4 శాతం పెరిగింది. ఐషర్ మోటార్స్, అంబుజా సిమెంట్, జీ ఎంటర్టైన్‌మెంట్స్,, విప్రో, భారతి ఇన్‌ఫ్రా షేర్లు నష్టాల బాట పట్టాయి.

English summary
The benchmark BSE Sensex today went past the 36,000 level for the first time while the Nifty hit another record high of 11,045.60.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X