కేంద్ర బడ్జెట్‌ 2018 : భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: బడ్జెట్ ప్రసంగం మొదలైంది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రసంగానికి శ్రీకారం చుట్టడానికి ముందే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ ర్యాలీ కొనసాగిస్తున్నాయి.

గురువారం ఉదయం ప్రారంభంలోనే 100 పాయింట్లకు ఎగిసిన సెన్సెక్స్‌ 36 వేల మార్కును తిరిగి చేధించింది. ప్రస్తుతం 230 పాయింట్ల లాభంలో 36,195 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 61 పాయింట్ల లాభంలో 11,088 వద్ద లాభాలు పండిస్తోంది.

Sensex, Nifty trade higher on budget day

మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌ కావడంతో మదుపరుల కళ్లన్నీ బడ్జెట్‌ పైనే ఉన్నాయి.
అయితే గ్లోబల్‌ మార్కెట్ల ప్రభావం, బడ్జెట్‌కు ముందు ఇన్వెస్టర్లందరూ అప్రమత్తంగా వ్యవహరించడంతో స్టాక్‌ మార్కెట్ సూచీలు గత రెండు రోజులుగా నష్టాలతో ముగిశాయి.

అయితే బడ్జెట్‌ ప్రారంభం కావడానికి కాస్త ముందుగా మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమవ్వడం సానుకూల అంశంగా కనిపిస్తోంది. అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించగానే, భారీగా హెచ్చు తగ్గులకు గురయ్యే అవకాశం ఉందని మరోవైపు స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు కూడా హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+