వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు ఊహించని రీతిలో కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పవనాలు, ఇన్వెస్టర్ల నుంచి ఎదురైన విపరీతమైన అమ్మకాల ఒత్తిడితో సోమవారం నుంచి వెండి ట్రేడింగ్ అతలాకుతలమైంది. భారతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ధరలు భారీగా పడిపోవడంతో ట్రేడింగ్ నిబంధనల ప్రకారం 'లోయర్ సర్క్యూట్' అమలై అమ్మకాలు తాత్కాలికంగా నిలిచిపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మే నెల డెలివరీకి సంబంధించిన వెండి ఒప్పందాలు ఒకే రోజులో ఏకంగా 9 శాతం మేర క్షీణించాయి. కిలో వెండిపై సుమారు రూ. 20,409 మేర ధర తగ్గడంతో, ప్రస్తుతం ధర రూ. 2,06,363 వద్ద స్థిరపడింది. సాధారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే వెండి, ఈ స్థాయిలో పతనం కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్ (COMEX)లో కూడా వెండి ఫ్యూచర్స్ ఔన్సుకు 9.34 శాతం తగ్గి 63.15 డాలర్ల వద్దకు పడిపోయింది.

డాలర్ జోరు.. వెండి బేజారు
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నప్పటికీ, వెండికి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్ బలపడటమేనని విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ విలువ పెరగడం, అమెరికా ట్రెజరీ బాండ్ దిగుబడులు అధికమవ్వడంతో వడ్డీ లేని ఆస్తులైన వెండి, బంగారంపై పెట్టుబడిదారులు ఆసక్తి తగ్గించుకున్నారు. దీనివల్ల అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఈ లోహాలు మరింత భారంగా మారాయి.
ద్రవ్య లభ్యత కోసం అమ్మకాలు
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. స్టాక్ మార్కెట్లు మరియు ఇతర రంగాల్లో వస్తున్న నష్టాలను భర్తీ చేసుకునేందుకు (Margin Calls) చాలా మంది ఇన్వెస్టర్లు వెండిలో ఉన్న తమ పెట్టుబడులను హుటాహుటిన ఉపసంహరించుకుంటున్నారు. మరోవైపు చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పైకి తన్నే అవకాశం ఉంది. దీనివల్ల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపును వాయిదా వేస్తాయన్న సంకేతాలు వెండి ధరలపై మరింత ఒత్తిడిని పెంచాయి.
పారిశ్రామిక డిమాండ్ పై నీలినీడలు
కేవలం పెట్టుబడిగానే కాకుండా, సోలార్ ప్యానెల్స్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండికి ఉండే పారిశ్రామిక డిమాండ్ కూడా ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఏర్పడవచ్చన్న భయాలతో పారిశ్రామిక అవసరాల కోసం వెండి కొనుగోళ్లు నిలిచిపోయాయి. వెండి మార్కెట్‌లో స్థిరత్వం రావాలంటే డాలర్ విలువ తగ్గడం లేదా వడ్డీ రేట్ల విషయంలో స్పష్టత రావడం అనివార్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
7,000mAh భారీ బ్యాటరీతో ఒప్పో కొత్త 5G ఫోన్.. ఎంతంటే ?? -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..!









Click it and Unblock the Notifications