బిగ్ షాక్.. భారీగా పెరగనున్న స్మార్ట్‌ ఫోన్‌, టీవీ, ల్యాప్‌టాప్‌ ధరలు

కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? లేదంటే పెద్ద స్క్రీన్ టీవీ లేదా ల్యాప్‌టాప్‌పై కన్నేశారా? అయితే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే రాబోయే వారాల్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఇప్పటికే మొదలైన ధరల పెంపు... త్వరలో మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ముందుండేవి మంచి రోజులు కాదు బిడ్డా అని దేవరా మూవీ డైలాగ్ గుర్తుందా మీకు. ఇప్పుడు సామాన్య మధ్య తరగతికి ఆ డైలాగ్ కచ్చితంగా చెప్పాలి. రెండు నెలలు.. మరో రెండే రెండు నెలల్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌, టీవీ లేదా ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి గట్టి షాక్ తగలబోతుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెరుగుతున్న నేపథ్యంలో, వచ్చే రెండు నెలల్లో మరోసారి భారీ పెంపు జరగనుందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడున్న ధరలే ఎక్కువగా అనిపిస్తే... ముందు రోజుల్లో పరిస్థితి మరింత భారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

smartphone TV laptop to Get Costlier as Memory Chip Shortage Pushes Up Prices

మెమొరీ చిప్స్ కొరత.

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం మెమొరీ చిప్స్ కొరత. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుండటంతో... డేటా సెంటర్లు, AI సర్వర్లు భారీగా మెమొరీని వినియోగిస్తున్నాయి. దీని ప్రభావంగా గత త్రైమాసికంలోనే మెమొరీ చిప్స్ ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం జనవరి-మార్చి త్రైమాసికంలో మరో 40-50 శాతం, ఏప్రిల్-జూన్ మధ్యలో 20 శాతం వరకు పెరుగుదల ఉండొచ్చని మార్కెట్ రీసెర్చ్ సంస్థలు చెబుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్ ధరలు ఎక్కేస్తున్న బ్రాండ్లు

ఈ ప్రభావం ఇప్పటికే మొబైల్ మార్కెట్‌పై పడింది. వివో, నథింగ్ వంటి బ్రాండ్లు తమ ఫోన్ల ధరలను రూ.3,000 నుంచి రూ.5,000 వరకు పెంచాయి. మరోవైపు శాంసంగ్‌ వంటి పెద్ద కంపెనీలు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు తగ్గిస్తూ పరోక్షంగా వినియోగదారులపై భారం పెంచుతున్నాయి. రాబోయే మోడళ్ల ధరలు మరింత ఎక్కువగా ఉంటాయని నథింగ్‌ సీఈఓ కార్ల్‌ పీ స్పష్టం చేయడం గమనార్హం.

రిటైలర్ల హెచ్చరిక

గత నవంబర్-డిసెంబర్ నెలల్లోనే స్మార్ట్‌ఫోన్ ధరలు కనీసం 3 శాతం నుంచి గరిష్ఠంగా 21 శాతం వరకు పెరిగాయి. అయితే ఇదే అంతమేమీ కాదని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ చెబుతోంది. మెమొరీ చిప్స్ ధరలు ఇలాగే పెరిగితే... రాబోయే రోజుల్లో ఫోన్ ధరలు మరో 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.

టీవీలకు కూడా అదే గతి

స్మార్ట్‌ఫోన్లే కాదు... టీవీ మార్కెట్ కూడా ఇదే దారిలో సాగుతోంది. కోడక్‌, థామ్సన్‌ వంటి బ్రాండ్ల టీవీలను విక్రయించే సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సంస్థ ప్రకారం... తాము ఆర్డర్ చేసిన మెమొరీ చిప్స్‌లో కేవలం 10 శాతం మాత్రమే అందుతోంది. ఇది చిప్స్ కొరత ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తోంది. ఇప్పటికే టీవీల ధరలు పెంచామని, ఫిబ్రవరిలో మరో 4 శాతం పెంపు తప్పదని ఆ సంస్థ సీఈఓ అవనీత్‌ సింగ్ తెలిపారు.

ల్యాప్‌టాప్ కొనుగోలు కూడా ఖరీదే

ల్యాప్‌టాప్ ధరలు ఇప్పటికే 5 నుంచి 8 శాతం వరకు పెరిగాయి. మెమొరీ, ప్రాసెసర్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో... ఈ సెగ్మెంట్‌లోనూ వినియోగదారులకు అదనపు భారం తప్పదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కొనాలనుకుంటే ఇప్పుడే ఆలోచించండి

మొత్తానికి AI బూమ్, మెమొరీ చిప్స్ కొరత కలిసి... స్మార్ట్‌ఫోన్‌, టీవీ, ల్యాప్‌టాప్ కొనుగోలు ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. టెక్‌ గ్యాడ్జెట్లు కొనాలనుకునే వారు ఆలస్యం చేస్తే... మరింత ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+