ఈవీ మార్కెట్లో సరికొత్త సునామీ: ఒక్క ఛార్జ్‌తో 600 కిలోమీటర్లు!
భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. తన మోస్ట్ పాపులర్ ఎలక్ట్రిక్ కారు పంచ్ ఈవీని సరికొత్త 'ఫేస్‌లిఫ్ట్' రూపంలో తీసుకువస్తోంది. ఫిబ్రవరి 20, 2026న మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ కారు రేంజ్ సామర్థ్యాకి సంబంధించి కంపెనీ ఇటీవల ఓ సంచలన వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో కొత్త పంచ్ ఈవీ సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 593.6 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
జైపూర్ నుంచి గుజరాత్ వరకు.. నాన్‌స్టాప్ జర్నీ!
టాటా మోటార్స్ అధికారికంగా విడుదల చేసిన ఈ వీడియోలో ఓ ఆటోమొబైల్ జర్నలిస్ట్ ఈ కారును రాజస్థాన్‌లోని జైపూర్ నుండి గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్ వరకు నడిపారు. ప్రయాణం మొదలైన జైపూర్ నుంచి ఉదయ్‌పూర్ (సుమారు 400 కి.మీ) చేరుకునే సమయానికి కూడా కారులో ఇంకా 34శాతం బ్యాటరీ మిగిలి ఉండటం విశేషం. చివరికి బ్యాటరీ పూర్తిగా సున్నా శాతానికి వచ్చేసరికి ఈ కారు మొత్తం 593.6 కిలోమీటర్లు ప్రయాణించి కొత్త రికార్డును సృష్టించింది. ఈ ప్రదర్శనతో సామాన్యులకు అందుబాటు ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఈవీగా పంచ్ EV నిలవనుంది.

భారీ బ్యాటరీ ప్యాక్?
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పంచ్ ఈవీ గరిష్టంగా 421 కి.మీ రేంజ్ ఇస్తుండగా.. కొత్త మోడల్ 593 కి.మీలకు పైగా ఇవ్వడం వెనుక పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బహుశా నెక్సాన్ ఈవీలో వాడే 45kWh లేదా అంతకంటే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఇందులో అమర్చి ఉండవచ్చని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక వివరాలను కంపెనీ ఫిబ్రవరి 20న వెల్లడించనుంది.
డిజైన్, ఫీచర్లలో ప్రధాన మార్పులు
కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ కేవలం రేంజ్‌లోనే కాకుండా డిజైన్ పరంగా కూడా చాలా మార్పులను సంతరించుకుంది. ముందు భాగంలో కొత్త బంపర్ డిజైన్, కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్,అట్రాక్టివ్ కొత్త అలాయ్ వీల్స్ రానున్నాయి. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ దీనికి మరింత ప్రీమియం లుక్‌ని ఇస్తాయి. లోపలి భాగంలో 12.3 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా మరియు వెంటిలేటెడ్ సీట్లు వంటి అదిరిపోయే ఫీచర్లు ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న రంగులతో పాటు కొత్తగా బ్రౌన్, బ్రైట్ ఎల్లో రంగుల్లో కూడా ఈ కారు లభించనుంది.
మార్కెట్ పోటీ
ఈ కొత్త రేంజ్ టెస్ట్‌తో టాటా పంచ్ ఈవీ తన ప్రధాన ప్రత్యర్థి అయిన మారుతి సుజుకి e-Vitara (సుమారు 500 కి.మీ రేంజ్) కి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 20న కంపెనీ ధరలను ప్రకటించిన తర్వాత ఇది ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టిస్తుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications