వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు: నేటి ధరలు ఇలా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి భారీ తగ్గాయి. గత రెండు రోజులుగా పెరుగుదల నమోదు చేసిన బంగారం ధర శుక్రవారం పడిపోయింది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 250 తగ్గి రూ.31,850కు చేరింది.

అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితులు, స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం బంగారం ధర పతనానికి కారణమైంది. మరోపక్క వెండి కూడా రూ. 100 తగ్గి కిలో రూ.39,250కి చేరింది.

today gold price goes down by rs 250 and silver price down by rs 100

పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం వెండి ధర తగ్గుదలకు కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా బుధవారం ధర 0.16శాతం తగ్గి ఔన్సు 1,199.40డాలర్లు పలికింది.

వెండి కూడా 0.03శాతం తగ్గి ఔన్సు 14.64డాలర్లకు చేరింది. న్యూఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.250తగ్గి రూ.31,850కి చేరగా, 99.5 నాణ్యత కలిగిన 10గ్రాముల బంగారం ధర రూ.31,700గా ఉంది.

English summary
Today gold price goes down by rs 250 and silver price down by rs 100.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X