Stock Market Crash : మార్కెట్ ఊచకోత: సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం, రూ.8.8 లక్షల కోట్లు ఆవిరి!

భారతీయ స్టాక్ మార్కెట్లు ఫిబ్రవరి 28న భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 2 శాతం మేర కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు, ఆర్థిక మందగమనం వంటి అంశాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో ఒక్కరోజే మదుపరుల సంపద రూ.8.8 లక్షల కోట్లు ఆవిరైపోయింది.

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ ట్రేడ్ వార్ ప్రకటనలను స్టాక్ మార్కెట్‌ను కుప్పకూలేలా చేశాయి. మెక్సికన్, కెనడియన్ వస్తువులపై 25 శాతం, చైనా దిగుమతులపై అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించడంతో మార్కెట్లో కలకలం రేపింది. అటు అమెరికా ఆర్థిక గణాంకాలు నిరాశపరచడం, టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా ప్రపంచ మార్కెట్లు బలహీనపడ్డాయి. ఇది భారతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. భారతీయ మార్కెట్లు, ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అధిక వాల్యుయేషన్ల వద్ద ట్రేడవుతుండటం కూడా పతనానికి ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరో వైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) ఫిబ్రవరిలో భారీగా భారతీయ ఈక్విటీలను విక్రయించారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచింది.

Trump s Trade War Jitters Sensex Nifty Plunge 2 Investors Lose 8 8 Lakh Crore

ఏ రంగం ఎంత నష్టపోయింది?:
దాదాపు అన్ని ప్రధాన రంగాల సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాల కారణంగా IT సూచీ అత్యధికంగా 4 శాతానికి పైగా పతనమైంది. ఆటో, FMCG, PSU బ్యాంక్, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్, మీడియా రంగాలు 2-4 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 0.8 శాతం నష్టపోయింది. ఫిబ్రవరిలో FIIలు రూ. 47,349 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా, DIIలు రూ. 52,544 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు

మార్కెట్ ముగింపు ఎలా ఉంది?
సెన్సెక్స్ 1,420 పాయింట్లు (1.9 శాతం) పతనమై 73,192 వద్ద ముగిసింది. నిఫ్టీ 418 పాయింట్లు (1.9 శాతం) క్షీణించి 22,126 వద్ద స్థిరపడింది. NSEలో కేవలం 400 స్టాక్స్ మాత్రమే లాభపడగా, 2,221 స్టాక్స్ నష్టపోయాయి. ఈ రోజు భారీగా నష్టపోయి వాటిల్లో M&M, భారతి ఎయిర్‌టెల్, విప్రో, టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ (5-7 శాతం క్షీణత), ప్రీమియర్ ఎనర్జీస్ (6 శాతం క్షీణత), IREDA (7 శాతం పతనం) మేరకు నష్టాన్ని మూటగట్టుకున్నాయి. లాభపడినవి వాటిల్లో హిందాల్కో, ట్రెంట్, HDFC బ్యాంక్, కోల్ ఇండియా (0.3-2 శాతం పెరుగుదల) ఉన్నాయి. ఇది వరుసగా ఐదవ నెల నష్టాలను నమోదు చేసింది, 29 సంవత్సరాలలో ఇదే అతి పొడవైన నష్టాల పరంపర అని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+