Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

EPF 36 నెలల రూల్: ఉద్యోగులు,పెన్షనర్లకు కీలక అప్‌డేట్

ఉద్యోగం మానేసిన తర్వాత లేదా పదవీ విరమణ చేసిన అనంతరం తమ ఈపీఎఫ్ ఖాతా పరిస్థితి ఏంటి? వడ్డీ కొనసాగుతుందా? ఖాతా నిద్రాణంగా (inoperative) మారిందేమో? అనే సందేహాలు అనేకమంది ఉద్యోగులు, పెన్షనర్లలో కనిపిస్తుంటాయి. ఈ గందరగోళానికి తెరదించేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అధికారులు ఇటీవల నిర్వహించిన లైవ్ సెషన్‌లో కీలక వివరాలు వెల్లడించారు.

ఈపీఎఫ్ఓ ప్రకారం, కేవలం ఉద్యోగం మానేసినందుకే లేదా కొంతకాలం చందాలు జమ చేయనందుకే ఈపీఎఫ్ ఖాతా నిద్రాణంగా మారదు. సభ్యుడు తుది సెటిల్‌మెంట్‌కు అర్హత పొందిన తర్వాత 36 నెలల పాటు ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే లేదా డబ్బు విత్‌డ్రా చేయకపోతే ఆ ప్రత్యేక ఈపీఎఫ్ మెంబర్ ఐడీని నిద్రాణ ఖాతాగా గుర్తిస్తారు. సాధారణంగా 58 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ, విదేశాలకు శాశ్వత వలస లేదా సభ్యుడు మరణించిన సందర్భాల్లో తుది సెటిల్‌మెంట్ అర్హత లభిస్తుంది.

What Happens to Your EPF After Leaving Job or Retirement Interest Dormant Rules Explained

ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) జీవితాంతం సక్రియంగానే ఉంటుంది. అయితే UAN కింద ఉన్న ప్రతి ఉద్యోగానికి సంబంధించిన ఈపీఎఫ్ ఖాతా వేర్వేరుగా పరిగణించబడుతుంది. తుది సెటిల్‌మెంట్ అర్హత వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల గడువు పూర్తయితే మాత్రమే ఆ ఖాతా నిద్రాణంగా మారుతుంది.

EPF బ్యాలెన్స్‌పై వడ్డీ

వడ్డీ విషయంలో కూడా ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది. సభ్యుడు ఉద్యోగం మానేసిన తర్వాత కూడా 58 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. 58 ఏళ్లు పూర్తైన తర్వాత కూడా తుది సెటిల్‌మెంట్‌కు అర్హత వచ్చిన తేదీ నుంచి మూడు సంవత్సరాల వరకు వడ్డీ లభిస్తుంది. ఆ తర్వాత కూడా డబ్బు క్లెయిమ్ చేయకపోతే ఖాతా నిద్రాణంగా మారి వడ్డీ జమ ఆగిపోతుంది.

58 ఏళ్లకు ముందే ఉద్యోగం వదిలినవారికి కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి. తుది సెటిల్‌మెంట్ అర్హత వచ్చిన తర్వాతే మూడు సంవత్సరాల లెక్క ప్రారంభమవుతుంది. దీంతో కెరీర్ విరామం తీసుకున్నవారు లేదా మధ్యలో ఉద్యోగం మానేసినవారు తమ పొదుపులపై వడ్డీ కోల్పోరు.

కేవైసీ అప్‌డేట్ చేసి..

నిద్రాణంగా గుర్తించబడిన ఈపీఎఫ్ ఖాతాలను తిరిగి సక్రియం చేసుకునే అవకాశం కూడా ఉంది. సభ్యులు ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వంటి కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసి, UAN యాక్టివ్‌లో ఉందని నిర్ధారించుకుని, ఆన్‌లైన్ లేదా ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయం ద్వారా చెల్లుబాటు అయ్యే క్లెయిమ్ సమర్పిస్తే ఖాతా మళ్లీ సక్రియమవుతుంది.

ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ..

ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) ఖాతా విషయానికి వస్తే, అది ఈపీఎఫ్‌లా నిద్రాణంగా మారదు. అయితే పెన్షన్ పొందుతున్నవారు ప్రతి సంవత్సరం నవంబర్‌లో జీవిత ధృవీకరణ పత్రం సమర్పించాలి. అది సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపులు తాత్కాలికంగా నిలిచే అవకాశం ఉంటుంది.

ఈపీఎఫ్ చందాదారులు తమ కేవైసీ వివరాలను సకాలంలో అప్‌డేట్ ఉంచడం, అవసరమైనప్పుడు క్లెయిమ్‌లు దాఖలు చేయడం ద్వారా వడ్డీ నష్టం నివారించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, సభ్యులు యూపీఐ ద్వారా నేరుగా ఈపీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకునేలా కొత్త మొబైల్ యాప్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఈపీఎఫ్ఓ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+