Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PF ఖాతాదారులకు శుభవార్త.. ఇక నేరుగా మీ UPI నుంచే విత్ డ్రా

మనం ఎంతో కాలంగా దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ (PF) ఏదైనా అవసరం వచ్చినప్పుడు.. విత్ డ్రా చేయాలంటే ఫారాలు నింపాలి. అప్రూవల్స్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు. అయితే ఈ పరిస్థితికి త్వరలోనే చెక్ పడనుంది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి వచ్చే కొత్త విధానంతో మీ డబ్బును క్షణాల్లో విత్ డ్రా చేసుకోవచ్చు

UPI ఆధారిత విత్‌డ్రా వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి EPFO సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త విధానం ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం అమలైతే దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది EPFO సభ్యులకు భారీ ఊరట లభించనుంది. ఇకపై PF డబ్బు కోసం ఫారాలు నింపడం, రోజులు తరబడి ఎదురు చూడడం అవసరం లేకుండా, మొబైల్‌లో ఉన్న UPI యాప్ ద్వారానే డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. సభ్యులు తమ EPF ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ను మొబైల్‌లోనే చూసుకుని, అవసరమైన మొత్తాన్ని ఎంచుకుని, UPI పిన్ ద్వారా విత్‌డ్రాను నిర్ధారిస్తే చాలు. డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ కానుంది.

EPFO to Enable PF Withdrawals via UPI from April Bringing Instant Access for 8 Crore Members

ప్రస్తుత విధానం పెద్దగా ఉపయోగం లేదు..

ప్రస్తుతం ఆన్‌లైన్ క్లెయిమ్ విధానం ఉన్నప్పటికీ, వైద్య ఖర్చులు, విద్య, పెళ్లి లేదా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు వెంటనే అవసరమైన వారికి ఇది పెద్దగా ఉపయోగపడడం లేదు. ఈ నేపథ్యంలోనే EPFO ఈ డిజిటల్ మార్పుకు అడుగులు వేస్తోంది. కొత్త విధానంతో PF డబ్బు తీసుకోవడం ATM లావాదేవీల మాదిరిగానే సులభంగా మారనుంది.

పూర్తిగా విత్‌డ్రా చేసుకునే అవకాశం

ఇప్పటికే EPFO సెంట్రల్ బోర్డ్ కొన్ని కీలక మార్గదర్శకాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అర్హత ఉన్న సభ్యులు తమ EPF ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండగా, రిటైర్మెంట్ భద్రత దృష్ట్యా కొంత మొత్తాన్ని ఖాతాలో ఉంచే నిబంధన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంశాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

బ్యాంకుల సహకారంతో

EPFOకు స్వంత బ్యాంకింగ్ లైసెన్స్ లేకపోవడంతో, ఈ UPI విత్‌డ్రా వ్యవస్థను బ్యాంకుల సహకారంతో అమలు చేయనున్నారు. భద్రతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, మోసాలకు అవకాశం లేకుండా సురక్షిత డిజిటల్ లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, UPI ద్వారా EPF విత్‌డ్రా వ్యవస్థ అమల్లోకి వస్తే ఉద్యోగుల జీవితాల్లో ఇది ఒక కీలక మార్పుగా నిలవనుంది. డబ్బు అవసరమైన సమయంలో వెంటనే అందుబాటులోకి రావడం ద్వారా ఆర్థిక ఒత్తిడి తగ్గడమే కాకుండా, డిజిటల్ ఇండియా లక్ష్యాలకు ఇది మరో బలమైన అడుగుగా మారనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+