Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌తో వ్యయసాయానికి పెద్ద పీట? రైతుల రుణాల పరిమితి పెంపు!
కేంద్ర బడ్జెట్-2025లో మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌పై రైతులు, ఆర్థిక నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగంపై ప్రభుత్వం 15% పెంపుతో సుమారు $20.2 బిలియన్ (₹1.75 లక్షల కోట్లు) ఖర్చు చేయాలని ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. ఇది గత ఆరు సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి ఇచ్చిన అతిపెద్ద నిధుల పెంపు అని చెప్పవచ్చు. నిధులు ఎక్కువగా కేటాయించడం వల్ల గ్రామీణ ఆదాయం పెంచడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం వంటి ప్రధాన లక్ష్యాలతో ప్రధాని మోదీ సర్కార్ ముందుకు వెళ్లబోతున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది..
వ్యవసాయ శాఖకు అదనపు నిధుల కేటాయింపు:
గత సంవత్సరం కేటాయించిన ₹1.52 లక్షల కోట్లతో పోలిస్తే ఈ సారి కాస్త ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ నిధులను అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలు (HYV seeds) అభివృద్ధి , నిల్వ , సరఫరా మౌలిక సదుపాయాలను పెంపొందించడం, అలాగే కూరగాయలు, కంది పప్పు, నూనె గింజలు, పాల ఉత్పత్తులను ప్రోత్సహించడంలో ఉపయోగించనున్నారు. వ్యవసాయ శాఖకు ప్రస్తుతం ఉన్న ₹1.23 లక్షల కోట్ల నిధులను, వ్యవసాయ పరిశోధన కోసం కేటాయించిన ₹99,410 కోట్ల నిధులను కూడా పెంచే అవకాశం ఉంది. ఈ చర్యలు వల్ల ప్రపంచంలో రెండవ అతిపెద్ద బియ్యం, గోధుమ, , చక్కెర ఉత్పత్తిదారుడిగా ఉన్న దేశంగా భారత్ నిలవనుంది. అటు ఆహార ధరల నియంత్రణలో సహాయపడతాయి.

ఆహార ధరల పెరుగుదల సమస్య:
2024 అక్టోబర్ నాటికి, దేశంలో ఆహార ధరలు ఏడాదికి 10% పెరిగాయి. ఈ నేపధ్యంలో, ప్రభుత్వం కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను అమలు చేసింది. ముఖ్యంగా, గోధుమల ఎగుమతులను నిరోధించడం . పప్పుల దిగుమతి సుంక రాయితీని పొడిగించడం వంటి చర్యలు తీసుకుంది.
వ్యవసాయ రంగం ప్రాముఖ్యత:
భారతదేశంలో వ్యవసాయ రంగం మొత్తం శ్రామిక శక్తిలో 45% మందికి ఉపాధి కల్పిస్తుంది. అదేవిధంగా, $3.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు 15% శాతం వాటా ఈ రంగం ద్వారా లభిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులను $50 బిలియన్ నుండి $80 బిలియన్ వరకు 2030 నాటికి పెంచి మిగులుదలను సృష్టించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది.
రైతు రుణాలు, పంటల భద్రతపై నూతన మార్గాలు:
ఈసారి రైతులకు అందించబడే సబ్సిడీతో కూడిన వ్యవసాయ రుణాల పరిమితిని ప్రస్తుతం ఉన్న ₹3 లక్షల నుండి ₹5 లక్షల వరకు పెంచే అవకాశముంది. అదేవిధంగా, పంటల భీమా పథకాలను మరింత విస్తరించే ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం. 2030 నాటికి పప్పుల ఉత్పత్తిని 30 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడంపై కూడా లక్ష్యం పెట్టినట్లు తెలుస్తోంది.
ఫిషరీస్ , ఆహార ప్రాసెసింగ్ రంగాలకు ప్రాధాన్యం:
ఫిషరీస్ రంగంలో వచ్చే ఐదేళ్లలో $9 బిలియన్ నిధులు పెట్టుబడి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది. అదనంగా, 2027 వరకు ఆహార ప్రాసెసింగ్ సంస్థలకు ₹10,900 కోట్ల ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది.
2025 బడ్జెట్‌లో రైతు సంక్షేమం, ఆహార భద్రత, వ్యవసాయ రంగ అభివృద్ధికి కేటాయించబడుతున్న నిధులు భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశంగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్గదర్శక చర్యలు, గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
-
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ?












Click it and Unblock the Notifications