వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Night Food: రాత్రి పూట ఈ ఆహారం తీసుకుంటున్నారా.. అయితే మీకు నిద్ర రాదు..!

|
Google Oneindia TeluguNews

ప్రస్తుత జీవన విధానంతో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. చాలా మంది లేట్ వరకు నిద్ర రాక ఇబ్బంది పడుతున్నారు. అయితే సరిగా నిద్ర లేకుంటే చాలా సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. సరిగా నిద్రపోకపోవడం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అలాగే బరువు కూడా పెరుగుతారుట. మరి రాత్రి పూట నిద్ర ఎందుకు త్వరగా రాదు అంటే.. మన ఆహారపు అలవాట్ల వల్ల నిద్రలేమి సమస్య వస్తుందట. అలాగే ఎక్కువగా ఫోన్లు, టీవీలు చూసే వారికి కూడా త్వరగా నిద్ర రాదట.

రాత్రి సమయంలో సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తిసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలను, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే స్నాక్స్ తీసుకుంటే సరిపోతుందట. ఇలాంటివి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు నిద్ర త్వరగా వస్తుందట. అలాగే రాత్రి నిద్రపోయే ముందు తేలికగా జీర్ణమయ్యే పండ్లు ను తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. పండ్లు తినడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుందట.

By not taking this food at night, you will fall asleep quickly

రాత్రి పూట కీరదోసకాయను తీసుకోవడం చాలా మంచిదట. ఎందుకంటే ఇందులో ఉండే ప్రొటీన్లు, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి సహాయపడతాయని చెబుతున్నారు.ద్రాక్ష, స్ట్రాబెరీ, అరటిపండు, ఆపిల్ వంటి పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుందట. నిద్ర త్వరగా వస్తుందట. రాత్రి నూనె పదార్థలు తీసుకోవద్దు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్ తినొద్దట. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యతో పాటు నిద్ర కూడ సరిగా పట్టదు.

రాత్రులు టీ, కాఫీ తాగితే త్వరగా నిద్ర రాదు. ఉదయం తాగితే ఏం కాదు కానీ రాత్రుళ్లు కూడా కాఫీ, టీ తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఎనర్జీ కూడా పూర్తిగా పోతుంది. కెఫెన్ ను తీసుకోవడం వల్ల ఏం చేసినా నిద్ర రాదట. సాయంత్రం 6 దాటిన తర్వాత కెఫిన్ పానీయాలను తాగకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రపోయే సమయంలో నీళ్లను ఎక్కువగా తాగకూడదట.

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల టాయిలెట్ పదే పదే వస్తుంది. దీంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది. అలాగే రాత్రిపూట చీజ్ ను తినొద్దట. ఎందుకంటే ఇది అంత తొందరగా అరగదట. దీంతో నిద్ర సరిగా రాదు. పడుకునే ముందు గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగితే హాయిగా నిద్రపడుతుంది. అందుకే పడుకునే కంటే అరగంట ముందు గోరు వెచ్చని నీరు తాగాలి. ప‌గ‌టి పూట ఎటువంటి ఆహార‌ప‌దార్థాల‌ను తీసుకున్నా ఏ ఇబ్బంది ఉండ‌దు. కానీ రాత్రిపూట చాలా మంది పెరుగ‌న్నంతో ప‌చ్చ‌డిని క‌లిపి తింటారు. కొంద‌రూ భోజ‌నాన్ని ప‌చ్చ‌డితో మొద‌లు పెడ‌తారు. కానీ రాత్రివేళ మాత్రం ప‌చ్చ‌ళ్ల‌ను తిన‌కూడ‌దట. మ‌రీ ముఖ్యంగా నిమ్మ‌కాయ‌, ఉసిరికాయ ప‌చ్చ‌ళ్ల‌ను అస‌లే తిన‌కూడ‌ద‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఊళ్లలో ఉండే వారు రాత్రి 7 నుంచి 8 గంటల లోపల భోజనం చేస్తారు. దీంతో తిన్న తర్వాత పడుకోవడానికి గ్యాపు ఉంటుంది. కానీ పట్టణాల్లో ఉన్నవారు ఉద్యోగం నుంచి రావాలంటే రాత్రి అవుతుంది. వాళ్లు రాగానే ప్రెష్ అయి ఆహారం తీసుకుంటారు. ఆ తర్వాత పడుకుంటారు. ఇలా చేయడం మంచిది కాదుయ ఇలా చేయడం వల్ల భవిష్యత్త్ అనారోగ్య సమస్యలు తలెత్తి నిద్ర పట్టదని చెబుతున్నారు.

English summary
Do not take many foods at night and do not fall asleep quickly. That is why fast digestible food should be taken.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X