చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు.. కెటిఆర్ - జ‌గ‌న్ మీటింగ్ ఎఫెక్ట్..!

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న ఆక‌స్మికంగా ర‌ద్దు అయింది. ఈ నెల 22 నుండి 26 వ‌ర‌కు దావోస్ లో జ‌రిగే ప్ర‌పంచ ఆర్దిక స‌ద‌స్సుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బృందం హాజ‌రు కావాల్సి ఉంది. అయితే, తాజాగా జ‌గ‌న్ - కేటీఆర్ భేటీ..ఏపిలో వేగంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలతో ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకోవాల‌ని మంత్రులు సీయం కు సూచించారు. దీంతో..ముఖ్య‌మంత్రి త‌న ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నారు.

దావోస్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు..

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నారు. ముఖ్య‌మంత్రి తో పాటుగా మంత్రులు లోకేష్‌, య‌న‌మ‌ల, అధికారుల బృందం ఈ నెల 22 నుండి 26 వ‌రకు దావోస్ లో ప‌ర్య‌టించాల్సి ఉంది. గ‌త కొన్నేళ్లుగా సీయం చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న లో పాల్గొన‌టం జ‌రుగుతోంది. ఈ ఏడాది కూడా దావోస్ లో జ‌రిగే ప్ర‌పంచ ఆర్దిక స‌ద‌స్సు లో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి నిర్ణ‌యించారు. ఈ మేర‌కు అక్క‌డ ప‌లువురు ప్ర‌ముఖుల‌తో భేటీలకు సంబంధించి కార్యాచ‌ర‌ణ సిద్దం అయింది.

ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి కేంద్ర విదేశాంగ శాక‌..వెళ్లే బృందంలోని స‌భ్యుల సంఖ్య‌.. ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన కాల ప‌రిమితి పై ఆంక్ష‌లు విధించింది. దీని పై రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రోసారి సంప్ర‌దింపు లు జ‌రిపి అనుమ‌తి సాధించింది. అయితే, ఈ రోజు అందుబాటులో ఉన్న మంత్రుల‌తో ముఖ్య‌మంత్రి స‌మావేశం అయ్యా రు. అందులో తాజా రాజ‌కీయ ప‌రిణామాల పై చ‌ర్చించారు. ప‌లువురు మంత్రులు..సీయం ను అందుబాటులో ఉంటే బాగుంటుంద‌ని.. రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్న ప‌రిస్థితుల్లో దావోస్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకోవాల‌ని మం త్రులు సూచించారు. దీంతో..ముఖ్య‌మంత్రి సైతం త‌న ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకుంటూ నిర్ణ‌యం తీసుకున్నారు.

Chandra Babu Davos tour cancelled : on Ministers Request..

కెటిఆర్‌..జ‌గ‌న్ మీటింగ్ ఎఫెక్ట్‌..

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో ఆహ్వానం పేరుతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైసిపి అధినేత జ‌గ‌న్ కు పోన్ చేసి కేటీఆర్ బృందాన్ని పంపారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. జ‌గ‌న్ సైతం సానుకూలంగా స్పందించారు. వ‌చ్చే నెల 14న అమ‌రావ‌తి లో జ‌గ‌న్ నూత‌న ఇంటి గృహ‌ప్ర‌వేశానికి కేసీఆర్ ను ఆహ్వానించారు. అదే రోజు వైసిపి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లోకి చేర‌టామా లేదా అనే అంశం పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌టంతో పాటుగా ఏపి రాజ‌కీయాల మీద కేసీఆర్ స్పందించే అవ‌కాశం ఉంది. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాన్ సైతం కొద్ది రోజులుగా జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెడుతున్నారు. జాతీయ స్థాయిలో 19న మ‌మ‌తా ఆధ్వ‌ర్యంలో క‌ల‌క‌త్తాలో జ‌రిగే ర్యాలీకి ఏ పార్టీల నేత‌లు హాజ‌ర‌వుతారనేది ఆస‌క్తి క‌రరం గా మారింది. చంద్ర‌బాబు ఈ ర్యాలీకి హాజ‌ర‌వుతున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో అటు జాతీయ స్థాయిలో..ఇటు రాష్ట్ర స్థాయిలో రాజ‌కీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. దీంతో..చంద్ర‌బాబు అందుబాటులో ఉండాల‌ని మంత్రులు కోరారు. దీంతో..త‌న దావోస్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్న ముఖ్య‌మంత్రి..ప‌ర్య‌ట‌న బాధ్య‌త‌ల‌ను లోకేష్ కు అప్ప‌గించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+