చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి లేదా ప్రత్యేక రాష్ట్ర హోదా: డీఎంకే డిమాండ్: చప్పట్లు కొట్టిన స్టాలిన్

|
Google Oneindia TeluguNews

చెన్నై: మూడు సంవత్సరాల కిందటి వరకూ జమ్మూ కాశ్మీర్.. స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా కొనసాగింది. ప్రత్యేక జెండా ఉండేది. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ అయిదేళ్లకోసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే.. జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం ఆరేళ్లకోసారి ఎన్నికల ప్రక్రియను చేపడతారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎవరూ అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోకూడదు. భూములను కొనుగోలు చేయకూడదు. దేశానికి తలమానికంగా భావించే జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఇన్నేళ్లుగా కొనసాగింది. దీనికి ప్రధాన కారణం.. ఆర్టికల్ 370.

అదే హోదా కోసం..

అదే హోదా కోసం..

మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ తరువాత ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. కేంద్ర పాలిత ప్రాంతాలుగా తీర్చిదిద్దింది. ఇప్పుడు అలాంటి స్వయం ప్రతిపత్తి హోదాను కోరుకుంటోంది తమిళనాడు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వివక్ష ధోరణిని ప్రదర్శిస్తోందని, అందుకే స్వయం ప్రతిపత్తి లేదా ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తోన్నట్లు ప్రకటించింది డీఎంకే.

నమక్కల్ సభలో..


డీఎంకే తరఫున కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో భారీ సమావేశాన్ని డీఎంకే ఏర్పాటు చేసింది. నమక్కల్‌లో ఈ సభలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్, కేంద్ర మాజీమంత్రి, లోక్‌సభ సభ్యుడు ఏ రాజా సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడారు. తాను అధికారంలో లేని రాష్ట్రాలను బీజేపీ చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. నిధుల కేటాయింపులో వివక్షతను ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు.

రాష్ట్రాల హక్కులను హరించేలా..

రాష్ట్రాల హక్కులను హరించేలా..

ప్రతి నెలా జీఎస్టీ సహా ఇతర రూపాల్లో వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తోన్నామని, అయినప్పటికీ.. వాటిని సకాలంలో రాష్ట్రానికి కేటాయించట్లేదంటూ ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్ పలు సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ.. కేంద్రం తన ధోరణిని మార్చుకోవట్లేదని అన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు స్టాలిన్ లేఖలు సైతం రాశారని గుర్తు చేశారు.

 రాష్ట్రాలపై పెత్తనం..

రాష్ట్రాలపై పెత్తనం..

తమిళనాడు నుంచి 6.5 శాతం మొత్తాన్ని జీఎస్టీగా కేంద్రానికి చెల్లించగా.. దీనికి బదులుగా అక్కడి నుంచి అందిన మొత్తం 2.5 శాతమేనని ఏ రాజా చెప్పారు. రాష్ట్రాలపై పెత్తనాన్ని చలాయించేలా వ్యవహరిస్తోందంటూ ఏ రాజా ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వయం ప్రతిపత్తి లేదా ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించాలంటూ డిమాండ్ చేయాల్సిన దుస్థితిని కేంద్రం కల్పించిందని అన్నారు. అలాంటి డిమాండ్ చేసే దుస్థితిలో తమ రాష్ట్రాన్ని నెట్టవద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను కోరుతున్నానని చెప్పారు.

వేదిక మీదే ముఖ్యమంత్రి..

వేదిక మీదే ముఖ్యమంత్రి..

రాజా మాట్లాడుతున్న సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ వేదిక మీదే ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర హోదా లేదా స్వయం ప్రతిపత్తి డిమాండ్‌ను లేవనెత్తినప్పుడు ఆయన చప్పట్లు అభినందించడం కనిపించింది. ఇదివరకు స్టాలిన్.. మ్యారిటైమ్ బోర్డ్ సహా కొన్ని కీలక అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. కేంద్రం రాష్ట్రాల హక్కులను తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోందని, దీనిపట్ల సంఘటితం కావాల్సిన అవసరం ఉందంటూ అప్పట్లో కోరారు.

English summary
DMK MP A Raja demand to the Centre autonomy for Tamil Nadu or we will seek separation. The DMK MP was speaking at a conference for local body representatives in Namakkal in front of CM MK Stalin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X