Cheating: కిలాడీ దంపతుల స్కెచ్, జ్యువెలర్స్ షాపు దెబ్బతో, రాత్రికి రాత్రి, రూ, కోట్లలో, సీసీటీవీల్లో!
చెన్నై/తిరుచ్చి: ఓ వ్యక్తి, అందంగా ఉన్న అతని భార్య జ్యువెలరీ షాపు ప్రారంభించారు. లేటెస్ట్ డిజైన్ బంగారు నగలతో పాటు వెండి వస్తులు ఆ జ్యువెలరీ షాపులో విక్రయిస్తున్నారు. కస్టమర్ల దగ్గర మంచి పేరు తెచ్చుకున్న దంపతులు ఇంతకాలం బాగానే వ్యాపారం చేశారు. కస్టమర్లు ఎక్కువ కావడం, జ్యువెలరీ షాపుకు మంచి పేరు రావడంతో ఆ దంపతులు బంగారు కంతుల చీటీల పేరుతో చీటీలు వేశారు. సంవత్సరం, రెండు సంవత్సరాల వరకు ప్రతినెల చీటీలు కడితే ఒకేసారి అధిక మొత్తం వడ్డీ చెల్లిస్తామని, తక్కువ రేటుకు బంగారు నగలు ఇస్తామని ప్రచారం చేశారు.
ఇప్పటికే జ్యువెలరీ షాపుకు మంచి పేరు ఉండటంతో స్థానిక జిల్లాతో పాటు పక్క జిల్లాల్లోని కొందరు ప్రజలు వారి దగ్గర చీటీలు వేశారు. ఇలా అమాయక ప్రజల దగ్గర భారీ మొత్తంలో చీటీ డబ్బులు వసూలు చేసిన కిలాడీ దంపతులు లగ్జరీ లైఫ్ గడపడం మొదలు పెట్టారు. ఇటీవల ఉదయం బంగారు నగల షాపు మూసివేసి ఉండటంతో అక్కడికి వెళ్లిన కొందరు కస్టమర్లు ఆరా తీశారు. జ్యువెలరీ షాపులో పని చేసే ఉద్యోగులు అనారోగ్యానికి గురైనారని, మూడు రోజుల తరువాత షాపు తీస్తామని జ్యువెలరీ షాపుకు ఓ కాగితం అతికించారు.
జ్యువెలరీ షాపు యజమాని ఇంటికి తాళం వేసి ఉండటంతో ప్రజలు షాక్ అయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి ఆరా తియ్యగా అర్దరాత్రి జ్యువెలరీ షాపులోని నగలు మొత్తం కారులో సర్దుకుని చెక్కేసిన విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన విషయం గుర్తించిన కస్టమర్లు బిత్తరపోయారు. రూ. 4 కోట్ల వరకు ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన కిలాడీ దంపతుల మాయం అయిపోయారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ఓ నాయకుడితో జ్యువెలరీ షాప్ యజమాని చాాల సన్నిహితంగా ఉండేవాడని, ఆయన అండ చూసుకుని అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెట్టాడని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే మాయం అయిన జ్యువెలరీ షాప్ యజమాని చిక్కితేనే అసలు మ్యాటర్ తెలుస్తుందని పోలీసు అధికారులు అంటున్నారు.

ఫేమస్ జ్యువెలరీ షాపు
తమిళనాడులోని సేలం జిల్లాలోని వీరనం ప్రాంతంలో ధనరాజ్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ధనరాజ్ అందంగా ఉన్న అతని భార్య లలితతో కలిసి సేలంలోని రాజగణపతి దేవాలయం సమీపంలో కొన్ని సంవత్సరాల క్రితం లలితాంబగై పేరుతో జ్యువెలరీ షాపు ప్రారంభించారు. లేటెస్ట్ డిజైన్ బంగారు నగలతో పాటు వెండి వస్తులు ధనరాజ్, లలిత దంపతులు వారి జ్యువెలరీ షాపులో విక్రయిస్తున్నారు.

విపరీతంగా పెరిగిపోయిన కస్టమర్లు
కస్టమర్ల దగ్గర మంచి పేరు తెచ్చుకున్న ధనరాజ్, లలిత దంపతులు ఇంతకాలం బాగానే వ్యాపారం చేశారు. కస్టమర్లు ఎక్కువ కావడం, జ్యువెలరీ షాపుకు మంచి పేరు రావడంతో ధనరాజ్, లలిత దంపతులు బంగారు కంతుల చీటీల పేరుతో చీటీలు వేశారు. సంవత్సరం, రెండు సంవత్సరాల వరకు ప్రతినెల చీటలు కడితే ఒకేసారి అధిక మొత్తం వడ్డీ చెల్లిస్తామని, తక్కువ రేటుకు బంగారు నగలు ఇస్తామని ధనరాజ్, లలిత దంపతులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

నెలకు లక్షల్లో వసూలు చేశారు
ఇప్పటికే లలితాంబగై జ్యువెలరీ షాపుకు మంచి పేరు ఉండటంతో సేలం జిల్లాతో పాటు పక్క జిల్లాల్లోని కొందరు ప్రజలు ధనరాజ్, లలితా దంపతుల దగ్గర చీటీలు వేశారు. ఇలా అమాయక ప్రజల దగ్గర భారీ మొత్తంలో చీటీ డబ్బులు వసూలు చేసిన కిలాడీ దంపతులు ధనరాజ్, లలిత లగ్జరీ లైఫ్ గడపడం మొదలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

షాపుకు పేపర్ అతికించేశారు
ఇటీవల ఉదయం లలితాంబగై జ్యువెలర్స్ షాపు మూసివేసి ఉండటంతో అక్కడికి వెళ్లిన కొందరు కస్టమర్లు ఆరా తీశారు. జ్యువెలరీ షాపులో పని చేసే ఉద్యోగులు అనారోగ్యానికి గురైనారని, మూడు రోజుల తరువాత షాపు తీస్తామని జ్యువెలరీ షాపుకు ఓ కాగితం అతికించారు. జ్యువెలరీ షాపు యజమాని ధనరాజ్ ఇంటి దగ్గరకు వెళ్లి చూడగా ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంతో ప్రజలు షాక్ అయ్యారు.

మామ ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని?
ధనరాజ్ అతని మామ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న కొందరు కస్టమర్లు అక్కడికి వెళ్లారు. అయితే మామ ఇంట్లో కూడా ధనరాజ్ లేడని తెలుసుకున్న కస్టమర్లు హడలిపోయారు. మాకు న్యాయం చెయ్యాలని రోడ్డు మీద ధనరాజ్, లలిత దంపతుల బాధితురాలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

రాత్రికి రాత్రి నగలతో కారులో ఎస్కేప్
సేలం పోలీసులు రంగంలోకి దిగి ఆరా తియ్యగా అర్దరాత్రి లలితాంబగై జ్యువెలరీ షాపులోని నగలు మొత్తం పని చేసే ఉద్యోగుల సహాయంతో ధనరాజ్, అతని భార్య లలిత కారులో సర్దుకుని చెక్కేసిన విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిందని వెలుగు చూడటంతో కస్టమర్లు బిత్తరపోయారు.

జస్ట్ రూ. 4 కోట్లు మటాష్
ఒక్కొక్కరి దగ్గర నెలకు రూ. 6 వేలు, రూ 3 వేలు, రూ. 10 వేలు ఇలా ఎంతపడితే అంత వసూలు చేసి సుమారు రూ. 4 కోట్లకు పైగా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన ధనరాజ్, లలితా దంపతులు మాయం అయిపోయారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బంగారు నగల చీటీల పేరుతో చీటీలు వేసి ప్రజలు నిలువునా ముంచేసిన ధనరాజ్, లలిత దపతుల కోసం గాలిస్తున్నామని సేలం జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications