చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Viral video: రైతును కొట్టి చంపేసిన ఎస్ఐ ?, లాక్ డౌన్ దెబ్బ, పక్క జిల్లాలో ఫ్రెండ్స్ తో కలిసి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/సేలం: కరోనా వైరస్ కారణంగా కొందరి ప్రాణాలు పోతుంటే లాక్ డౌన్ దెబ్బతో మరికొందరి ప్రాణాలు పోతున్నాయి. లాక్ డౌన్ సందర్బంగా పలు ఆంక్షలు అమలు చేసిన ప్రభుత్వం లిక్కర్ షాలను మాత్రం వింత నియమాలు పెడుతోందని ఆరోపణలు ఉన్నాయి. లాక్ డౌన్ దెబ్బతో పక్కజిల్లాలో మద్యం సేవించడానికి కొందరు రైతులు వెళ్లారు. మద్యం సేవించి సొంత జిల్లాలో అడుగుపెట్టే సమయంలో ముగ్గురిని పట్టుకుని పోలీసులు చితకబాదేశారు. ఎస్ఐ దెబ్బలు తట్టుకోలేని ఓ రైతు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీసులు నడిరోడ్డు మీద కింపడిన రైతును చితకబాదుతున్న సమయంలో తీసిన వీడియో వైరల్ కావడంతో సామాన్య ప్రజలు పోలీసులకు శాపనార్తాలు పెడుతున్నారు.

Recommended Video

Viral video: రైతును కొట్టి చంపేసిన ఎస్ఐ ?, లాక్ డౌన్ దెబ్బ, పక్క జిల్లాలో ఫ్రెండ్స్ తో కలిసి !

Illegal affair: ఎర్రగా, బుర్రగా ఉన్నానని భార్యకు బలుపు, ప్రియుడితో ఎస్కేప్, భర్త కేసు పెడితే !Illegal affair: ఎర్రగా, బుర్రగా ఉన్నానని భార్యకు బలుపు, ప్రియుడితో ఎస్కేప్, భర్త కేసు పెడితే !

లాక్ డౌన్ దెబ్బతో పక్కజిల్లాలో లిక్కర్ షాపులు

లాక్ డౌన్ దెబ్బతో పక్కజిల్లాలో లిక్కర్ షాపులు


తమిళనాడులో కరోనా వైరస్ మహమ్మారి కొన్ని జిల్లాల్లో తాండవం చేస్తోంది. కరోనా లాక్ డౌన్ నియమాలు కొన్ని జిల్లాల్లో మాత్రమే సడలించారు. సేలం జిల్లాలో లాక్ డైన్ నియమాలు సడలించకపోవడంతో ఆ జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టాస్మాక్ లిక్కర్ షాపులు పూర్తిగా మాతపడ్డాయి.

పక్క జిల్లాలకు పరుగో పరుగు

పక్క జిల్లాలకు పరుగో పరుగు


సేలం జిల్లాకు చెందిన కొందరు మందుబాబులు పక్క జిల్లాలకు వెళ్లి మద్యం సేవించి తరువాత వాళ్ల ఇళ్లకు వెలుతున్నారు. సేలం జిల్లాలోని అత్తూర్ సమీపంలోని కలవరాయన్ కొండ సమీపంలోని పప్పనాయక్కన్ పట్టి గ్రామం నుంచి పక్క జిల్లాలైన ధర్మపురి, కల్లకురిచి జిల్లాలకు వెళ్లడానికి మార్గం ఉంది. ఇదే గ్రామం మీదుగా పక్క జిల్లాలకు వెలుతున్న మందుబాబులు మద్యం సేవిస్తున్నారు.

చెక్ పోస్టులో చితకబాదిన ఎస్ఐ

చెక్ పోస్టులో చితకబాదిన ఎస్ఐ


సేలం జిల్లాకు చెందిన రైతు మురగేషన్ (45) తో పాటు మరో ఇద్దరు రైతులు బైక్ లో పక్కజిల్లాకు వెళ్లి మద్యం సేవించారు. మద్యం సేవించిన మురగేషన్ మరో ఇద్దరు కలిసి బైక్ లో సొంత గ్రామానికి వెళ్లడానికి బైక్ లో బయలుదేరారు. సేలం జిల్లా సరిహద్దులో చెక్ పోస్టు ఏర్పాటు చేసిన స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ, పోలీసులు కలిసి వీరి బైక్ ను నిలిపారు. ముగ్గురు మద్యం సేవించారని తెలుసుకున్న ఎస్ఐ, పోలీసులు వారిని పట్టుకుని చితకబాదేశారు.

నడిరోడ్డులో పడేసి రెచ్చిపోయిన ఎస్ఐ

నడిరోడ్డులో పడేసి రెచ్చిపోయిన ఎస్ఐ

పోలీసులు కొట్టే దెబ్బలు తట్టుకోలేక మురగేషన్ తో పాటు మరో ఇద్దరు సార్, మమ్మల్ని వదిలేయండి, ఇంకోసారి ఇటువైపురాము అంటూ పోలీసులను వేడుకున్నారు. ఆ సమయంలో పోలీసుల దెబ్బలకు మురగేష్ రోడ్డు మీద కుప్పకూలిపోయాడు. ఇంట్లో పెళ్లాంతో గొడవ చేసుకుని వెళ్లాడో ? ఏమో ?, కాని ఎస్ఐ మాత్రం రోడ్డు మీదపడిపోయిన మురగేషన్ ను లాఠీతో చితకబాదేశాడు.

నడిరోడ్డులో ప్రాణం పోయింది

నడిరోడ్డులో ప్రాణం పోయింది

మురగేషన్ వెన్ను, తలలో నుంచి రక్తం కారడంతో అతన్ని వజప్పాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన తరువాత సేలం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్రగాయాలైన మురగేషన్ కు ఎక్కువ రక్తం పోవడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు చెప్పారు.

 సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఎస్ఐతో పాటు పోలీసులు ఓవర్ యాక్షన్ తో లాఠీలతో చితకబాదుతున్న సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. పోలీసుల దెబ్బలతో ప్రాణం పోయిన మురగేషన్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మురగేష్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసుల ఓవర్ యాక్షన్

మరగేషన్ మీద లాఠీతో చికతబాదిన ఎస్ఐని అరెస్టు చేశామని తమిళనాడు పోలీసు అధికారులు అంటున్నారు. తమిళనాడులో గత ఏడాది పోలీసుల ఓవర్ యాక్షన్ కు తండ్రి కొడుకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన విషయం మరిచిపోక ముందే ఆ రాష్ట్రంలో మరో సంఘటన వెలుగు చూడటం కలకలం రేపింది.

English summary
Chennai: In a shocking incident from Tamil Nadu, a 40-year-old man died after he was brutally thrashed by a police officer in Salem district. The accused special Sub-Inspector has been arrested in connection with the murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X