Helicopter crash: అటవి ప్రాంతంలో అందుకే సాధ్యం కాలేదు ?, డాక్టర్లు, స్థానికులు, పర్వతాల కింద !
చెన్నై/ఊటి/న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ సిరీస్ హెలికాప్టర్ కుప్పకూలడంతో హడలిపోయిన స్థానికులు ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని సూలురు నుంచి నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ కు బయలుదేరిన ఆర్మీ హెలికాప్టర్ కూనూరు సమీపంలోని అటవి ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయిన ప్రాంతం దట్టమైన అటవి ప్రాంతం కావడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడి చేరుకోవడానికి సాధ్యం కాలేదు. స్థానికులు మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు. హెలికాప్టర్ కుప్పకూలడంతో అ ప్రాంతంలోని భారీ చెట్లు కుప్పకూలి కొన్ని బూడిద అయ్యాయి. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య కూడా ఆ హెలికాప్టర్ లో ఉండటంతో భారతీయులు, ఆర్మీ అధికారులు, సిబ్బంది హడలిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా నివాసం ఉంటున్న వారు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించడానికి ప్రయత్నించారు.

వెంటనే సమాచారం ఇచ్చిన స్థానికులు
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని సూలురు నుంచి బుధవారం నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ కు బయలుదేరిన ఆర్మీ హెలికాప్టర్ కూనూరు సమీపంలోని అటవి ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పొగ మంచు కారణమా ?
కనూరు సమీపంలోని వాంపైర్ అటవి ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దట్టమైన పొగ మంచు కారణంగా ఈ హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హెలికాప్టర్ లో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్యతో సహ ఆర్మీకి చెందిన 14 మంది ఈ హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారని అధికారులు అంటున్నారు.

అటవి ప్రాంతం కావడంతో సాధ్యం కాలేదు
ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయిన ప్రాంతం దట్టమైన అటవి ప్రాంతం కావడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకోవడానికి సాధ్యం కాలేదు. స్థానికులు మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు. హెలికాప్టర్ కుప్పకూలడంతో అ ప్రాంతంలోని భారీ చెట్లు కుప్పకూలి కొన్ని బూడిద అయ్యాయి. అటవి ప్రాంతంలో అతి కష్టం మీద సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది బయలుదేరారు.

ఆరు మంది వైద్యులు
స్థానిక మిలటరీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన ఆరు మంది వైద్యుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని వైద్యపరీక్షలు అందిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరి మృతదేహాలను గుర్తించి వెలికి తీశారు. పర్వతాల కింద ఇంకా కొన్ని మృతదేహాలు పడి ఉన్నాయనే అనుమానంతో స్థానికుల సహాయంతో వాటిని వెలికి తియ్యడానికి ఆర్మీ అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య పరిస్థితి గురించి మాత్రం ఇంకా ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.












Click it and Unblock the Notifications