చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

CM wife:కన్నీళ్లు పెట్టుకున్న దుర్గా స్టాలిన్, 25 ఏళ్ల నాటి స్టోరీ రిపీట్, ఇద్దరూ ఇద్దరే,శుక్రవారం స్టాలిన్ కు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా MK Stalin ప్రమాణస్వీకారం చేశారు. ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అనే నేను అనే మాట వినపడగానే ఆయన భార్య దుర్గా స్టాలిన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. వీవీఐపీలకు కేటాయించిన ముందు వరుసలో కుర్చుకున్న దుర్గా స్టాలిన్ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమె పక్కనే కుర్చున్న ఆమె కుమారుడు, ఎమ్మెల్యే ఉదయానిధి స్టాలిన్ తల్లిని ఓదార్చారు.

స్టాలిన్ ప్రామాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆయన వైపు ఎంత మంది చూస్తున్నారో అంతకంటే ఎక్కువ మంది దృష్టి దుర్గా స్టాలిన్ వైపు మళ్లింది. 25 ఏళ్ల నిరీక్షణకు ఈ రోజు ఫలితం దక్కిందని డీఎంకే వర్గాలు అంటున్నారు. దుర్గా స్టాలిన్ కన్నీలు పెట్టుకోవడం వెనుక చాల 25 ఏళ్ల నాటి స్టోరీతో పాటు చాలా పెద్ద కథే ఉంది.

Illegal affair: ఫ్రీగా చిక్కిందని వడ్డీ వ్యాపారి రోజూ ఫుల్ మీల్స్, చక్రవడ్డీ లెక్కేసిన ప్రియురాలు!Illegal affair: ఫ్రీగా చిక్కిందని వడ్డీ వ్యాపారి రోజూ ఫుల్ మీల్స్, చక్రవడ్డీ లెక్కేసిన ప్రియురాలు!

ఆ ఒక్క మాటతో కన్నీళ్లు

ఆ ఒక్క మాటతో కన్నీళ్లు

శుక్రవారం ఉదయం చెన్నైలో తమిళనాడు గవర్నర్ భన్వరీల్ పురోహిత్ డీఎంకే అధినేత ఎంకే. స్టాలిన్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు ఎంకే. స్టాలిన్ ఆయన కుటుంబ సభ్యులను గవర్నర్ కు పరిచయం చేశారు. ముత్తువేల్ కురుణానిధి స్టాలిన్ అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా..... అనే మాట స్టాలిన్ చెప్పగానే వీవీఐపీలకు కేటాయించిన ముందు వరుసలో కుర్చుకున్న ఆయన భార్య దుర్గా స్టాలిన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ఒక్క మాట కోసం దుర్గా స్టాలిన్ ఇంతకాలం ఎదురు చూశారు.

25 ఏళ్ల నాటి స్టోరీ రిపీట్

25 ఏళ్ల నాటి స్టోరీ రిపీట్

తమిళనాడులో ఏ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేకుండా సొంతంగా 1996లో డీఎంకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారం దక్కించుకుంది. తరువాత డీఎంకే పార్టీ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసినా వేరే పార్టీ మద్దతుతోనే అది సాధ్యం అయ్యింది. అయితే 25 ఏళ్ల తరువాత డీఎంకే పార్టీ పూర్తి మెజారిటీతో ఏ పార్టీ మద్దతు లేకుండా 2021లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 'ఏక్ నిరంజన్' అంటూ ఎంకే. స్టాలిన్ ఒంటి భుజాల మీద డీఎంకే పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో ఆయన భార్య దుర్గా స్టాలిన్ ఉద్వేగానికి లోనైనారు.

మామ, భర్త నాస్తికులు.... దుర్గా మాత్రం!

మామ, భర్త నాస్తికులు.... దుర్గా మాత్రం!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి, ఆయన కుమారుడు ఎంకే. స్టాలిన్ నాస్తికులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎంకే. స్టాలిన్ భార్య దుర్గా స్టాలిన్ రూటే వేరే అని డీఎంకే వర్గాలు, వారి బంధువులు అంటున్నారు. కరుణానిధి బతికున్న సమయంలో కూడా దుర్గా స్టాలిన్ అనేక గుడులు, గోపురాలు చుడుతూ తన భర్త ముఖ్యమంత్రి కావాలని అనేక పూజలు, వ్రతాలు చేశారని డీఎంకే వర్గాలు అంటున్నాయి. మామ, భర్త నాస్తికులు అయినా దుర్గా స్టాలిన్ కు మాత్రం ధైవభక్తి ఎక్కువే అని వారి సన్నిహితులు అంటున్నారు.

దుర్గా చెయ్యి మాత్రం కలపలేదు

దుర్గా చెయ్యి మాత్రం కలపలేదు

ఎంకే. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో డీఎంకే నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన నాయకులు చప్పట్లు కొట్టడంతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. అయితే స్టాలిన్ భార్య దుర్గా మాత్రం చప్పట్లు కొట్టకుండా ఆమె కళ్లలో వస్తున్న నీళ్లను ఆపుకుంటూ చేత్తో తుడుచుకోవడం అందరి దృష్టి ఆమె వైపు మళ్లింది. దుర్గా స్టాలిన్ కళ్లలో కన్నీళ్లు రాలేదని, అవి ఆనంద బాష్పాలని స్టాలిన్ సన్నిహితులు అంటున్నారు.

శుక్రవారం స్టాలిన్ కు కలిసోచ్చింది

శుక్రవారం స్టాలిన్ కు కలిసోచ్చింది

నాస్తికుడైన ఎంకే. స్టాలిన్ కు శుక్రవారం మాత్రం చాలా కలసి వచ్చే రోజు అని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. స్టాలిన్ భార్య పేరు దుర్గా. దుర్గా అనే పేరు అమ్మవారి పేరు అని హిందువులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దుర్గాను పెళ్లి చేసుకున్న తరువాత స్టాలిన్ కు అన్ని కలిసే వచ్చాయి. స్టాలిన్ నాస్తికుడైనా ఆయన భార్య దుర్గా మాత్రం ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తూ వచ్చారు.

Recommended Video

Sonu Sood Helps Suaresh Raina | Oneindia Telugu
అమ్మ పూజలు ఫలించాయి

అమ్మ పూజలు ఫలించాయి

తమిళనాడు ముఖ్యమంత్రిగా మొదటిసారి స్టాలిన్ ప్రమాణస్వీకారం చేసిన రోజు శుక్రవారం కావడంతో ఆయన ఆరోజు చాలా కలిసిసోచ్చిందని ఆయన సన్నిహితులు అంటున్నారు. మొత్తం మీద మా నాయకుడు స్టాలిన్ సతీమణి దుర్గా మేడమ్ పూజలు ఫలించాయని డీఎంకేలోని దైవభక్తి ఉన్న నాయకులు సంతోషంగా చెబుతున్నారు.

English summary
CM wife: Durga Stalin eyes filled with tears while MK Stalin taking oath as Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X