కాలేజ్ అమ్మాయిని ఏం చేశారు ?, బావిలో శవమైంది, రాత్రి ఇంటి నుంచి వెళ్లి!
చెన్నై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇద్దరు పిల్లలు సర్వస్వం అని జీవిస్తున్నారు. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన అమ్మాయి కొంతసేపు తమ్ముడితో మాట్లాడింది. తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన కాలేజ్ అమ్మాయి నిర్జనప్రదేశంలోని బావిలో శవమై కనిపించడం కలకలం రేపింది.
తమిళనాడులో విల్లుపురం జిల్లా చెంచి సమీపంలోని భరతంగల్ గ్రామంలో కన్నియప్పన్, ఉషా దంపతులు నివాసం ఉంటున్నారు. కన్నియప్పన్, ఉషా దంపతులకు 16 ఏళ్ల కుమార్తె, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కుమార్తె సెంజీరాజి దేశింగు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొడుకు తంగల్‌కరై పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.

ఉషా కుమార్తె సంజీరాజీ గురువారం సాయంత్రం ఎప్పటిలాగే కాలేజ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. సంజీరాజి తమ్ముడితో కలిసి ఇంట్లో ఉంది. సంజీరాజీ తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లగా, ఇంట్లో ఇద్దరూ ఉన్నారు. రాత్రి 7 గంటల సమయంలో పక్కింటికి వెళ్లి వస్తానని తమ్ముడికి చెప్పిన కాలేజ్ అమ్మాయి సంజీరాజి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాలేదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తల్లిదండ్రులు ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చి కూతురు సంజీరాజీ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. అక్కడ బావి దగ్గర సంజీరాజీ చెప్పులు పడి ఉండడం చూసి షాక్ తిన్నారు. దీంతో వారు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో వెతకగా కాలేజ్ అమ్మాయి సంజీరాజీ కాలేజ్ యూనిఫాంలో శవమై కనిపించింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాలేజ్ అమ్మాయి సంజీరాజీని హత్యా చేశారా ?, లేక ఆత్మహత్యా చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. పోస్టుమార్టుం నివేదికలో అసలు విషయం తెలుస్తుందని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే కాలేజ్ అమ్మాయి సంజీరాజీని ఎవరైనా బావి దగ్గరకు పిలుచుకుని అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించి చంపేశారా ? అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications