చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేక్ బండ్ అభివృద్ధి: ఏడు హిందూ ఆలయాలను కూల్చేసిన కోయంబత్తూరు కార్పొరేషన్

|
Google Oneindia TeluguNews

కోయంబత్తూరు: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని పూసరిపాలయం రహదారికి దూరంగా ముత్తన్నంకులం వద్ద ఉన్న ఏడు దేవాలయాలను కోయంబత్తూరు కార్పొరేషన్ మంగళవారం కూల్చివేసింది. అక్రమంగా నిర్మించిన నివాసాలను కూల్చివేసిన అధికారులు ఇప్పుడు ఈ ఆలయాలను కూడా కూల్చివేశారు.

ఇది స్మార్ట్ సిటీస్ మిషన్ కింద నవీకరణలు చేపట్టేందుకే తాము ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్. రవిచంద్రన్, అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె. సత్య వెల్లడించారు.

encroachment: Coimbatore Corporation Demolishes seven hindu temples to develop lake bund.

అమ్మన్ కోవిల్, మునీశ్వరన్ కోవిల్ తోపాటు మరో ఏడు హిందూ దేవాలయాలను పెద్ద యంత్రాలను ఉపయోగించి నేలమట్టం చేశారు. ఇక్కడ లేక్ బండ్ అభివృద్ధి చేస్తామని, సుందరీకరణ పనుల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా, ఇప్పటికే ఇక్కడ ఉంటున్న సుమారు 300 కుటుంబాలను ఖాళీ చేయించి, బయటకు పంపారు.

2020 నుంచి ఇప్పటి వరకు 2400 కుటుంబాలను వారి నివాసాలను నేలమట్టం చేసి. ట్యాంక్ బండ్ ప్రాంతం నుంచి పంపించేశారు. వీరందరికీ మరో చోట నివాసాలను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రజలందరినీ ఇక్కడ్నుంచి పంపించివేసిన తర్వాత ఇప్పుడు ఆలయాలను కూల్చివేసే పనిలో పడ్డారు అధికారులు.

ఆలయాల కూల్చివేతకు నిరసనగా ఆందోళన చేపట్టిన వందలాది మందిని పోలీసులు అక్కడ్నుంచి పంపించేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దేశాలతోపాటు నివాసాలను కూల్చి ఈ ప్రాంతాన్ని ఆక్రమణల నుంచి విముక్తి కల్పించామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 14 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మొత్తం లేక్ ట్యాంక్ ఏరియా 90 ఎకరాలు ఉంటుందని చెబుతున్నారు. ఇది ఇలావుంటే, ఇక కృష్ణంపతి ట్యాంక్ ప్రాంతంలో ఉన్న ఆక్రమ నిర్మాణాలను కూల్చివేసి స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు.

English summary
encroachment: Coimbatore Corporation Demolishes seven hindu temples to develop lake bund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X