Hindi: తమిళనాడులో పెరుగు వివాదం.. స్పందించిన సీఎం స్టాలిన్..!

తమిళనాడులో హిందీ భాషపై మరోసారి వివాదం చెలరేగింది. పెరుగు ప్యాకెట్లపై కర్డ్ కు బదులు దహీ అనే పదం ముద్రించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని నందిని డెయిరీ నోటీసులు జారీ చేసింది. ప్రతిగా తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కర్డ్ ప్యాకెట్లపై హిందీ పదమైన 'దహీ' పదాన్ని ముద్రించబోమని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)కి తెలియజేసింది.

ఈ విషయమై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తీవ్రంగా స్పందించారు. ఓ ట్వీట్ కూడా చేశారు. "#HindiImposition నిస్సంకోచమైన పట్టుదలలు మన స్వంత రాష్ట్రాలలో తమిళం, కన్నడ భాషలను బహిష్కరించి, హిందీలో పెరుగు ప్యాకెట్‌ను కూడా లేబుల్ చేయమని మమ్మల్ని నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయి" అని అన్నారు. "మన మాతృభాషల పట్ల ఇటువంటి నిర్మొహమాటంగా నిర్లక్ష్యం చేయడం వల్ల బాధ్యులు దక్షిణాది నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తారు" అని ఆయన అన్నారు.

Hindi language dispute in tamilnadu, cm stalin respond on that

హిందీ నిబంధన డిఎంకె ఐదు ప్రధాన సూత్రాలకు విరుద్ధమని డెయిరీ డెవలప్ మెంట్ మంత్రి నాసర్ అన్నారు. ఆగస్టులోపు ఈ (FSSAI ఆదేశాన్ని) అమలు చేయాలని కోరుతూ తమకు లేఖ వచ్చిందన్నారు. కానీ మేము నో చెప్పామన్నారు. "ఇక్కడ హిందీకి స్థానం లేదు. గత సంవత్సరం, మా ప్యాకెట్లలో పాలకు బదులుగా 'దూద్' అని చెప్పాలని వారు కోరుకున్నారు. కానీ మేం నో చెప్పాం" అని ఆయన వివరించారు.

హిందీ పదం దహీని ఉపయోగించినందుకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్రం ఎప్పుడూ ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తోందని అన్నామలై అన్నారు. తొలిసారిగా నూతన విద్యా విధానంలో పిల్లలకు వారి మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+