Illegal affair: డ్రైవర్ మొగుడు, పెయింటర్ ప్రియుడు, బొమ్మ బాగా వేశాడని, చీల్చిచెండాడు!
చెన్నై/ఈరోడ్: భర్తతో కాపురం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భార్య జీవితంలోకి ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకు భర్త ఎలా చెబితే అలా వింటున్న భార్య, భర్త ఏమి అడిగినా కాదనకుండా ఇస్తున్న భార్య ఎదురు తిరగడం మొదలు పెట్టింది. నా భార్యకు ఏమైయ్యింది ? అంటూ భర్త ఆరా తీశాడు. అంతే భర్త మైండ్ బ్లాక్ అయ్యింది.
అందమైన తన భార్యకు నా ఇంటికి పెయింట్ చెయ్యడానికి వచ్చి వెళ్లిన ఓ పెయింటర్ తో అక్రమ సంబంధం ఉందని గుర్తించాడు. అంతే ఎంత చెప్పినా భార్య చెప్పిన మాట వినకపోవడంతో ఆమె గొంతు చీల్చి చెందాడి దారుణంగా చంపేసిన భర్త చేతులు దులుపుకున్నాడు.

డ్రైవర్ హ్యాపీలైఫ్
తమిళనాడులోని ఈరోడ్ లో రాజన్, రజని (28) దంపతులు నివాసం ఉంటున్నారు. రాజన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. డ్రైవర్ గా పని చేస్తున్నన రాజన్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. రాజన్ అతని భార్య రజనితో కలిసి హ్యాపీగా జీవనం సాగిస్తున్నాడు. సమయం చిక్కిప్పుడు భార్య రజనిని ఆమె భర్త రాజన్ బయటకు పిలుచుకుని వెలుతున్నాడు.

భార్యలో తేడా వచ్చేసింది
భర్త రాజన్ తో కాపురం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భార్య రజని జీవితంలోకి పెయింటర్ సెల్వా అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకు భర్త రాజన్ ఎలా చెబితే అలా వింటున్న భార్య రజనిలో కొంచెం తేడా వచ్చింది, భర్త రాజన్ ఏమి అడిగినా కాదనకుండా ఇస్తున్న భార్య రజని అతనికి ఎదురు తిరగడం మొదలు పెట్టింది.

డ్రైవర్ మొగుడు..... పెయింటర్ ప్రియుడు
డ్రైవర్ గా పని చేస్తున్న భర్త రాజన్ ఎక్కువగా బయట ఉండటంతో అతని భార్య పెయింట్ పని చేస్తూ పరిచయం అయిన సెల్వాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. మంచి ఫిగర్ చిక్కడంతో సెల్వా కూడా రజనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా రజని, సెల్వా అక్రమసంబంధం సాగిపోయింది. ప్రియుడు సెల్వాతో ఎంజాయ్ చేస్తున్న రజని ఆమె భర్త రాజన్ ను నిర్లక్షం చేసింది.

ఈ నగరానికి ఏమైయ్యింది అనే టైపులో నా భార్యకు ఏమైయ్యింది ?
భార్య రజనిలో మార్పులు రావడంతో రాజన్ ఆలోచించాడు. ఈ నగరానికి ఏమైయ్యింది అనే సినిమా యాడ్ టైపులో నా భార్య రజనికి ఏమైయ్యింది ? అంటూ భర్త రాజన్ ఆరా తీశాడు. అంతే భర్త రాజన్ మైండ్ బ్లాక్ అయ్యింది. అందమైన తన భార్య రజనికి నా ఇంటికి పెయింట్ చెయ్యడానికి వచ్చి వెళ్లిన పెయింటర్ సెల్వాతో అక్రమ సంబంధం ఉందని గుర్తించాడు.

పద్దతి మార్చుకో..... లేదంటే పైకిపోతావు
సెల్వాతో నువ్వు అక్రమ సంబంధం సాగిస్తున్న విషయం తనకు తెలిసిందని, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందు నువ్వు పద్దతి మార్చుకోవాలని, లేదంటే నిన్ను చంపేసి పైకి పంపిస్తానని రాజన్ అతని భార్య రజనికి అనేకసార్లు వార్నింగ్ ఇచ్చాడు. భర్తకు తన విషయం తెలిసిపోవడంతో రజని రహస్యంగా ఆమె ప్రియుడు సెల్వాను కలుసుకోవడం మొదలు పెట్టింది.

భార్యను గొంతు కోసి చంపేసిన భర్త
భార్య రజని చెప్పినమాట వినడం లేదని రగిలిపోయిన భర్త రాజన్ ఆమెను చంపేస్తే పీడపోతుందని డిసైడ్ అయ్యాడు. ఇంట్లో భార్య రజనితో గొడవ పడటం మొదలుపెట్టాడు. చివరికి రాత్రి నిద్రపోతున్న భార్య రజనిని గొంతు కోసి చంపేసిన రాజన్ పరారైనాడు. భార్యను హత్య చేసి పరారైన ఆమె భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications