• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: భర్త తమ్ముడితో ?, థ్రిల్లర్ సినిమా స్కెచ్, భారీ వర్షం, కరెంట్ కట్, అర్దరాత్రి భర్తను!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ హోసూరు/ క్రిష్ణగిరి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చెయ్యడంతో ముగ్గురు పిల్లలు పుట్టారు. ట్రక్కు డ్రైవర్ అయిన భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. వేరే ఊరిలో నివాసం ఉంటున్న భర్త బంధువుల అబ్బాయి దంపతుల ఇంటికి వచ్చి వెలుతున్నాడు. వరుసకు సోదరుడు అయ్యే యువకుడు, తన భార్య కంటే 10 సంవత్సరాల చిన్నవాడు ఇంటికి వచ్చి వెలుతుంటే భర్తకు, బంధువులకు ఎలాంటి డౌట్ రాలేదు. తరువాత 12 రీళ్ల సినిమా స్టోరీ జరిగినట్లు చాలా కథ జరిగింది. మద్యలో భార్య నెల రోజులు ప్రియుడితో పారిపోయి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చింది. అర్దరాత్రి ఇంటి సమీపంలోని భర్త తల్లిదండ్రులు ఇంటికి వెళ్లిన భార్య తన భర్త తన మీద దాడి చేసి ఇంటి నుంచి బయటకు తరిమేశాడని చెప్పింది.

కోడలికి సర్దిచెప్పిన అత్తమామలు గంట తరువాత కొడుకు ఇంటికి వెళ్లి చూశారు. కొడుకు గొంతు పూర్తిగా తెగిపోయి ఉండటం, అతని చేతిలో కత్తి ఉండటం చూసి షాక్ అయ్యారు. తన భర్త మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకన్నాడని అక్కడే ఉన్న అత్తమామల ముందు బోరున విలిపించిన భార్య అక్కడ కుప్పకూలిపోయింది. తరువాత భర్త అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. అయితే పోలీసులకు ఎక్కడో తేడా వచ్చిందని అనుమానం వచ్చింది. భర్త గొంతు కోసుకుంటే ప్రాణం పోయిన తరువాత కూడా అతని చేతిలో కత్తి అలాగే ఉండటంతో ఇదేమైనా సినిమానా ? అంటూ అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కూపీ లాగారు. భార్య, ఆమె ప్రియుడు అచ్చం సినిమా సీన్ లాగా పక్కాప్లాన్ తో భారీ వర్షాలు పడుతున్న సమయంలో కరెంట్ పోయిన తరువాత భర్తను చంపేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

Illegal affair: కోటీశ్వరుడి భార్య, ప్రియుడితో బిజినెస్ మ్యాన్ భార్య జంప్, రెండు నెలలు, క్లైమాక్స్ లో!Illegal affair: కోటీశ్వరుడి భార్య, ప్రియుడితో బిజినెస్ మ్యాన్ భార్య జంప్, రెండు నెలలు, క్లైమాక్స్ లో!

పెద్దలు చేసిన పెళ్లి

పెద్దలు చేసిన పెళ్లి

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని హోసూరు సమీపంలోని డెంకణికోట (బెంగళూరు గ్రామీణ జిల్లా సరిహద్దు) ఉనికిశెట్టి పల్లెలో అయ్యప్పన్ (37) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అయ్యప్పన్ రూపా (29) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న అయ్యప్పన్, రూపా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

భర్త ట్రక్కు డ్రైవర్

భర్త ట్రక్కు డ్రైవర్

ట్రక్కు డ్రైవర్ అయిన అయ్యప్పన్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. కరోనా వైరస్ దెబ్బతో చాలా కాలం ఇంటికే పరిమితం అయిన అయ్యప్పన్ ఇప్పుడు ఎక్కువగా ట్రక్కు నడుపుతూ డబ్బులు సంపాధించాలని కష్టపడి పని చేస్తున్నాడు. ఇంట్లో ఉంటున్న రూపా ఆమె ముగ్గురు పిల్లలను చూసుకుంటున్నది.

 వదినను సెట్ చేసుకున్న అబ్బాయి

వదినను సెట్ చేసుకున్న అబ్బాయి

డెంకణికోటే సమీపంలోని జవ్వలగిరి సమీపంలోని మంజులగిరిలో అయ్యప్పన్ సమీప బంధువు తంగమణి (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మంజుల గిరిలో నివాసం ఉంటున్న అయ్యప్పన్ బంధువుల అబ్బాయి తంగమణి రూపా ఇంటికి వచ్చి వెలుతున్నాడు. ఇదే సమయంలో రూపాకు, తంగమణికి చనువు ఏర్పడి రాసుకుని పూసుకుని తిరిగారు. ఓ రోజు అయ్యప్పన్ ట్రక్కు తీసుకుని వేరే ఊరికి వెళ్లిన సమయంలో ఆదే రోజు రాత్రి రూపా ఇంటిలోనే ఉండిపోయిన తంగమణిని ఆమెను అర్దరాత్రి సెట్ చేసుకుని ఆమెతో ఎంజాయ్ చేశాడు.

10 ఏళ్ల తేడా ఉండటంతో ఎవ్వరికి డౌట్ రాలేదు

10 ఏళ్ల తేడా ఉండటంతో ఎవ్వరికి డౌట్ రాలేదు

వరుసకు సోదరుడు అయ్యే తంగమణి తన భార్య రూపా కంటే 10 సంవత్సరాల చిన్నవాడు కావడం, అతను పదేపదే ఇంటికి వచ్చి వెలుతుంటే అయ్యప్పన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులకు ఎలాంటి డౌట్ రాలేదు. మన విషయం ఎవ్వరికి తెలీలేదు అనుకున్న రూపా, తంగమణి విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు. అయ్యప్పన్ బయట ఊరికి వెళ్లాడని తెలిసిన వెంటనే తంగమణి అతని ఇంటికి వెళ్లి అతని భార్య రూపాతో మస్త్ మజా చేశాడు. తంగమణి, రూపా అక్రమ సంబంధం పెట్టుకుని కళ్లు మూసుకుపోయి మస్త్ మజా చేశారు.

మరిదితో లేచిపోయిన భార్య

మరిదితో లేచిపోయిన భార్య

మూడు నెలల క్రితం రూపా ఇంట్లో పిల్లలను వదిలేసి ఆమె ప్రియుడు తంగమణితో కలిసిపారిపోయింది. 10 రోజులకు పైగా తంగమణి, రూపా ఎవ్వరికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ ఎంజాయ్ చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలించి చివరికి తంగమణి, రూపాను పట్టుకుని ఇంటికి పిలుచుకుని వచ్చారు. ఆరోజు నుంచి తంగమణిని అయ్యప్పన్ అతని ఇంటికి రానివ్వకుండా చేశాడు.

భార్య పరువు తీసిందని మందుబాబు అయిపోయిన భర్త

భార్య పరువు తీసిందని మందుబాబు అయిపోయిన భర్త

తన భార్య లేచిపోయి తన పరువు తీసిందని అయ్యప్పన్ తాగుడుకు బానిస అయ్యాడు. ఇదే సమయంలో మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న అయ్యప్పన్ ప్రతిరోజూ అతని భార్య రూపాను పట్టుకుని చితకబాదడం మొదలు పెట్టాడు. తరువాత ప్రియుడు తంగమణికి ఫోన్ చేసిన రూపా మర్యాదగా నా భర్తను చంపేస్తావా ? లేదంటే నేను ఆత్మహత్య చేసుకోవాలా నువ్వే చెప్పు అని బెదిరించింది. అయ్యప్పన్ ను చంపేసి మనం పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉందామని తంగమణి అతని ప్రియురాలు అయిన వదిన రూపాకు చెప్పాడు.

థ్రిల్లర్ సినిమా స్కెచ్

థ్రిల్లర్ సినిమా స్కెచ్

అక్టోబర్ 21వ తేదీన బంధువు చనిపోవడంతో అయ్యప్పన్ అంత్యక్రియలకు వెళ్లాడు. బంధువు అంత్యక్రియలకు వెళ్లిన అయ్యప్పన్ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. తరువాత అయ్యప్పన్, అతని భార్య రూపా పెద్దగా గొడవ పడటం అందరూ చూశారు. అదే రోజు ఆ ఊరిలో భారీగా వర్షం పడి కరెంట్ కట్ అయ్యింది. అర్దరాత్రి దాటిన తరువాత రూపా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.

నాటకాలు ఆడి డ్రామా పండించిన భార్య

నాటకాలు ఆడి డ్రామా పండించిన భార్య

అర్దరాత్రి వర్షంలో తడుచుకుంటూ ఇంటి సమీపంలోని భర్త అయ్యప్పన్ నివాసం ఉంటున్న తల్లిదండ్రులు ఇంటికి వెళ్లిన రూపా నా భర్త తన మీద దాడి చేసి ఇంటి నుంచి బయటకు తరిమేశాడని చెప్పింది. కోడలు రూపాకు సర్దిచెప్పిన అత్తమామలు గంట తరువాత కొడుకు అయ్యప్పన్ ఇంటికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. తన భర్త అయ్యప్పన్ మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకన్నాడని అక్కడే ఉన్న అత్తమామల ముందు బోరున విలిపించిన రూపా అక్కడే కుప్పకూలిపోయింది. అయ్యప్పన్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు అయ్యప్పన్ అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి.

గొంతు కోసుకుంటే గొంతు కోసుకుంటే కత్తి అలాగే ఉంటుందా , ఇదేమైనా సినిమానా ,అలాగే ఉంటుందా , ఇదేమైనా సినిమానా ?

గొంతు కోసుకుంటే గొంతు కోసుకుంటే కత్తి అలాగే ఉంటుందా , ఇదేమైనా సినిమానా ,అలాగే ఉంటుందా , ఇదేమైనా సినిమానా ?

పోలీసులకు ఎక్కడో తేడా వచ్చిందని అనుమానం వచ్చింది. అయ్యప్పన్ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటే అతని ప్రాణం పోయిన తరువాత కూడా అతని చేతిలో కత్తి అలాగే ఉండటంతో మరింత అనుమానం వచ్చింది. ఇదేమైనా సినిమానా ? చనిపోయిన వ్యక్తి చేతిలో కత్తి అలాగే ఉండటానికి అంటూ అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు రూపాను అదుపులోకి తీసుకుని కూపీ లాగారు.

మైండ్ బ్లాక్..... సీన్ టూ సీన్ చెప్పిన భార్య

మైండ్ బ్లాక్..... సీన్ టూ సీన్ చెప్పిన భార్య

రూపా గంటకు ఒకమాట చెప్పడంతో పోలీసులు ఆమెకు ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆసమయంలో రూపా మ్యాటర్ మొత్తం చెప్పింది. అర్దరాత్రి తన ప్రియుడు తంగమణి ఇంటికి వచ్చాడని, మద్యం మత్తులో ఉన్న తన భర్త అయ్యప్పన్ కాళ్లు చేతులు తన డ్రెస్ వేల్ తో కట్టేసి అతని గొంతు కోసి చంపేశామని రూపా చెప్పింది. తరువాత కేసు నుంచి తప్పించుకోవడానికి తన భర్త అయ్యప్పన్ చేతిలో కత్తి పెట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లి అత్త ఇంటికి వెళ్లానని రూపా చెప్పింది.

Recommended Video

డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్న టీటీడిపి
థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోదు

థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోదు

తన ప్రియుడు తంగమణితో కలిసి తన భర్త అయ్యప్పన్ ను నేనే హత్య చేశానని రూపా అంగీకరించిందని పోలీసులు అన్నారు. భార్య, ఆమె ప్రియుడు అచ్చం సినిమా సీన్ లాగా పక్కాప్లాన్ తో భారీ వర్షాలు పడుతున్న సమయంలో కరెంట్ పోయిన తరువాత భర్తను చంపేశారని వెలుగు చూడటం క్రిష్ణగిరి జిల్లాలో కలకలం రేపింది.

English summary
Illegal affair: Husband beheaded near thenkanikottai in Krishnagiri district in Tamil Nadu. Suicide drama wife, boyfriend are trapped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X