Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: రౌడీని చంపిన పోలీసులు, భార్యను లేపేసిన ప్రియుడు, కుర్రాడితో రౌడీ భార్య!

చెన్నై/ మధురై: రౌడీషీటర్ అతను కోరుకున్న యువతిని పెళ్లి చేసుకుని ఎంజాయ్ చెయ్యాలని అనుకున్నాడు. అనుకున్నట్లే ఆమెను పెళ్లి చేసుకుని పిల్లలకు తండ్రి అయ్యాడు. అనేక కేసుల్లో జైలుకు వెళ్లిన రౌడీషీటర్ శిక్ష అనుభవించాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన ఆ క్రిమినల్ ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని జైల్లో పెట్టడానికి తీసుకెళ్లారు. ఎస్ఐ గొంతు కోసి తప్పించుకోవడానికి ప్రయత్నించిన రౌడీని పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపేశారు. హత్యకు గురైన రౌడీషీటర్ భార్య ఆమె భర్త శిష్యుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది.

రౌడీషీటర్ బంధువులు వార్నింగ్ ఇవ్వడంతో రౌడీగారి పెళ్లామ్ సైలెంట్ అయిపోయి ప్రియుడిని దూరం పెట్టింది. తన గురువు భార్య తనకు పడక సుఖం ఇవ్వడం మానేసిందని రగలిపోయిన ప్రియుడు రౌడీషీటర్ భార్యను నడిరోడ్డులో దారుణంగా నరికి చంపేశాడు. గురువు భార్యను దారుణంగా హత్య చేసిన నిందితుడు అనుకున్న పని పూర్తి చేసి తరువాత బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ ఎంజాయ్ చేస్తున్నాడు.

రౌడీషీటర్ లవ్ స్టోరీ..... బయట అరాచకాలు

రౌడీషీటర్ లవ్ స్టోరీ..... బయట అరాచకాలు

తమిళనాడులోని కడలూరు జిల్లా తిరుపతి పుల్లియూర్ సమీపంలోని కుప్పంగుళం ప్రాంతంలో కృష్ణన్ అలియాస్ కృష్ణ (34) నివాసం ఉంటున్నాడు. కృష్ణన్ చిన్న వయసులోనే నేరాలు చెయ్యడం అలవాటు చేసుకున్నాడు, కృష్ణన్ అతనికంటూ రౌడీగ్యాంగ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్ లు చేసిన రౌడీ కృష్ణన్ గాంధీమతి (30) అనే యువతిని ప్రేమించి ఆమెను వివాహం చేసుకున్నాడు.

గాంధీమతిని వివాహం చేసుకున్న కృష్ణన్ కూతురు, కొడుక్కి తండ్రి అయ్యాడు. భార్య గాంధీమతి, ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణన్ సంతోషంగానే ఉండేవాడు. ఇదే సమయంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వీరమణి అలియాస్ వీరా అనే రౌడీషీటర్ ను కృష్ణన్ అతని అనుచరులు దారుణంగా నరికి చంపేశారు.

ఎస్ఐని చంపిన రౌడీ ఎన్ కౌంటర్

ఎస్ఐని చంపిన రౌడీ ఎన్ కౌంటర్

వీరా హత్య కేసులో తప్పించుకుని తిరుగుతున్న కృష్ణన్ ను పక్కాప్లాన్ తో పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణలో భాగంగా రౌడీషీటర్ కృష్ణన్ ను విచారణ చేసిన తరువాత అతన్ని కోర్టు ముందు హాజరుపరచడానికి పోలీసులు జీపులో బయలుదేరారు. ఆ సమయంలో ఎస్కార్టుగా వెలుతున్న ఎస్ఐ గొంతు కోసి తప్పించుకోవడానికి ప్రయత్నించిన రౌడీషీటర్ కృష్ణన్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపేశారు.

గురు భార్యతోనే రౌడీషీటర్ శిష్యుడు?

గురు భార్యతోనే రౌడీషీటర్ శిష్యుడు?

రౌడీషీటర్ కృష్ణన్ కు అనేక మంది శిష్యులు ఉన్నారు. రౌడీషీటర్ కృష్ణన్ కు ప్రధాన అనుచరుడిగా అరవింద్ (23) అనే యువకుడు గుర్తింపు తెచ్చుకున్నాడు. కృష్ణన్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన తరువాత అతని గ్యాంగ్ ను అరవింద్ చూసుకుంటున్నాడు. ఇదే సమయంలో ఎన్ కౌంటర్ లో చనిపోయిన గురువు కృష్ణన్ భార్య గాంధీమతితో అరవింద్ చనువుగా ఉన్నాడు. ఇదే సమయంలో భర్త కృష్ణన్ చనిపోవడంతో అతని శిష్యుడు అరవింద్ కు గాంధీమతి దాసోహం అయ్యింది.

భర్త శిష్యుడితో తిరుగుతోందని?

భర్త శిష్యుడితో తిరుగుతోందని?

అరవింద్ అతని గురువు కృష్ణన్ భార్య గాంధీమతి ఇంటికి ఎప్పుడుపడితే అప్పుడు వెళ్లి ఆమెతో ఎంజాయ్ చేస్తూ కాలం గడిపాడు. భర్త లేని గాంధీమతి ఇంటికి అరవింద్ పదేపదే వెళ్లి వస్తున్న విషయం కృష్ణన్ కుటుంబ సభ్యులు గమనించారు. నీ మొగుడు పేరు మోసిన రౌడీషీటర్, అతను ఎన్ కౌంటర్ లో చనిపోతే నువ్వు అతని శిష్యుడితో అక్రమ సంబంధం పెట్టుకుని పరువు తీస్తున్నావని, నువ్వు పద్దతి మార్చుకోవాలని గాంధీమతికి వార్నింగ్ ఇచ్చారు.

బంధువులు, కుటుంబ సభ్యులు, భర్త శిష్యులు కొందరు వార్నింగ్ ఇవ్వడంతో భయపడిన గాంధీమతి ఆమె ప్రియుడు అరవింద్ ను దూరం పెట్టింది. తన ప్రియురాలు గాంధీమతి దూరం అయ్యిందని, తనతోకాకుండా మరో యువకుడిని ఆమె సెట్ చేసుకుంటుందని అరవింద్ రగలిపోయాడు.

ప్రియురాలిని చంపేసిన జూనియర్ రౌడీ

ప్రియురాలిని చంపేసిన జూనియర్ రౌడీ

తనకు దక్కనిది ఎవ్వరికి దక్కకూడదని, గాంధీమతిని చంపేస్తే పీడపోతుందని అరవింద్ డిసైడ్ అయ్యాడు. గాంధీమతిని హత్య చెయ్యడానికి స్కెచ్ వేసిన ఆమె ప్రియుడు అరవింద్ ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ముగ్గురు మైనర్లను రంగంలోకి దింపాడు. రాత్రి షాపు నుంచి ఇంటికి వెలుతున్న గాంధీమతితో ముగ్గరు అబ్బాయిలు మాట్లాడుకున్నారు.

గాంధీమతితో మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడిచి వెలుతున్నారు. ఆ సమయంలో బైక్ లో వచ్చిన అరవింద్ అతని ప్రియురాలు గాంధీమతిని అడ్డగించారు. ప్రియుడు అరవింద్ తో పాటు ముగ్గురు మైనర్లు కత్తులతో గాంధీమతిని నడిరోడ్డులో దారుణంగా పొడిచి స్పాట్ లో చంపేశారు. జైలుకు వెళ్లిన రౌడీతో పాటు మిగిలిన నిందితులు జైలు నుంచి బయటకు రావాలని ఇంకా ప్రయత్నాలు చేస్తున్నానే ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+