Lady: ఉద్యోగం చేస్తున్న లేడీతో ?, 8సార్లు అబార్షన్, భార్యకు మ్యాటర్ లీక్, ఇంట్లోనే సజీవదహనం చేసిన దంపతులు!

చెన్నై/ఈరోడ్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కొంతకాలం కాపురం చేసింది. భర్తతో గొడవపడి విడిపోయిన ఆమె ఓ షోరూమ్ లో ఉద్యోగంలో చేరింది. షోరూమ్ యజమాని ఆమెతో చనువుగా ఉంటున్నాడు. పని చేస్తున్న మహిళను లొంగదీసుకున్న యజమాని ఆమెతో అక్రమ సంబందం పెట్టుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల షోరూమ్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించిన మహిళ అదే షోరూమ్ యజమాని ఇంట్లో సజీవదహనం కావడం కలకలం రేపింది.

భర్తతో విడిపోయిన మహిళ

భర్తతో విడిపోయిన మహిళ

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని భవానిలో సుమా అలియాస్ పుష్పా అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం సుమా పెళ్లి చేసుకుంది. కొంతకాలం తరువాత సుమా ఆమె భర్తకు గొడవలు జరిగాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోవడంతో సుమా ఆమె భర్తతో విడిపోయి వేరేగా నివాసం ఉంటున్నది.

షోరూమ్ యజమాని?

షోరూమ్ యజమాని?

ఇదే సమయంలో భవానిలోని గణపతి సిమెంట్ అండ్ టైల్స్ షోరూమ్ లో సుమా ఉద్యోగంలో చేరింది. టైల్స్ షోరూమ్ యజమాని నవనీతన్ భర్తకు దూరంగా ఉంటూ తన దగ్గర పని చేస్తున్న సుమాను లొంగదీసుకున్నాడని తెలిసింది. ఉద్యోగం చేస్తున్న మహిళను నవనీతన్ లైంగిక వేదింపులకు గురి చేశాడని తెలిసింది.

8సార్లు అబార్షన్

8సార్లు అబార్షన్

విషయం బయటకు తెలిస్తే తన ఉద్యోగం ఊడిపోతుందని భయపడిన సుమా నవనీత్ ఆగడాలు భరించింది. ఇటీవల సుమా తనను షోరూమ్ యజమాని నవనీతన్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు తనకు 8 సార్లు అబార్షన్ చేయించాడని, ఈ విషయం బయటకు తెలిస్తే చంపేస్తానని షోరూమ్ యజమాని నవనీతన్ బెదిరిస్తున్నాడని సుమా ఆరోపించింది. కొంతకాలం క్రితం సుమా షోరూమ్ లో ఉద్యోగం మానేసింది.

ఇంట్లోనే నిప్పంటించిన దంపతులు

ఇంట్లోనే నిప్పంటించిన దంపతులు

నవనీతన్ ఫోన్ చేసి రావాలని చెప్పడంతో సుమా అతని ఇంటికి వెళ్లింది. కొంతసేపు నవనీతన్, అతని భార్య అఖిల కలిసి సుమా మీద దాడి చేశారని తెలిసింది. కొంతసేపటి తరువాత సుమాకు మంటలు వ్యాపించి గట్టిగా కేకలు వేసింది. స్థానికులు విషయం గుర్తించి సుమాను కోయంబత్తూరులోని ఆసుపత్రికి తరలించారు.

పిన్ టూ పిన్ చెప్పి చనిపోయిన మహిళ

పిన్ టూ పిన్ చెప్పి చనిపోయిన మహిళ

తన మాజీ యజమాని నవనీతన్, అతని భార్య అఖిల తన మీద కిరోసిన్ పోసి నిప్పంటించారని ఆసుపత్రిలో సుమా పోలీసులకు చెప్పింది. చికిత్స విఫలమై సుమా చనిపోయింది. నవనీతన్, అతని భార్య అఖిల పరారైనారని, వాళ్ల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. లైంగిక వేధింపులు చేసిన వ్యక్తి భార్య అఖిల చేతిలో సుమా హత్యకు గురికావడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+