Rains: చెన్నైలో భరతనాట్యం చేస్తున్న వానదేవుడు, రోడ్లు క్లోజ్, కరెంట్ కట్, మాకే ఈ కష్టాలు ఎందుకు !

చెన్నై/కోయంబత్తూరు/మదురై: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంతో తమిళనాడు ప్రజలు హడలిపోతున్నారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని అనేక ప్రాంతాల ప్రజలు వరద నీటితో జలమయం అయ్యాయి. చెన్నై సిటీలోని పలు ప్రాంతాలు వరదనీరులో మునిగిపోయాయి. తమిళనాడులో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై సిటీలో ముఖ్యంగా చాలా డివిజన్లలో పరిస్థితి మరి దారుణంగా తయారైయ్యింది. చెన్నై సిటీలోని పలు ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లోని అండర్ పాస్ లు, టెన్నల్స్ పూర్తిగా వరద నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో వాటిని అధికారులు మూసివేశారు. గత నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో చెన్నై సిటీ ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 12 గంటల నుంచి గ్యాప్ లేకుండా చెన్నైలో భారీ వర్షం కురుస్తోంది.

Recommended Video

    Chennai Rains : చెన్నై సిటీ జలమయం... మాకే ఎందుకు ఈ కష్టాలు Red Alert | AP || Oneindia Telugu

     హడలిపోతున్న తమిళ ప్రజలు

    హడలిపోతున్న తమిళ ప్రజలు

    తమిళనాడులో గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంతో తమిళనాడు ప్రజలు హడలిపోతున్నారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని అనేక ప్రాంతాల ప్రజలు వరద నీటిలో మునిగిపోయాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీతో పాటు తమిళనాడులోని అనేక జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. గత నాలుగు రోజులుగా తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది.

    చెన్నై సిటీలో పవర్ కట్

    చెన్నై సిటీలో పవర్ కట్


    ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై సిటీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వాయుగుండం ప్రభావంతో చెన్నైలో భారీగా వర్షాలు పడుతున్నాయి. వర్షం నీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో చెన్నై సిటీలోని అనేక ప్రాంతాలు జలమయం కావడంతో కొన్ని అడుగుల తోలు నీరు లిచిపోయింది.

    రోడ్లో ఏవో ..... గుంతలు ఏవో కనుక్కోవడం కష్టం

    రోడ్లో ఏవో ..... గుంతలు ఏవో కనుక్కోవడం కష్టం

    చెన్నై సిటీలోని పలు ప్రాంతాలోని రహదారులు, డ్రైనేజ్ లో పూర్తిగా కలిసిపోవడంతో ఏవి రోడ్లో ?, ఏవి డ్రైనేజ్ లో కనుక్కోవడం కొత్త వారికి, వాహనాలలో సంచరిస్తున్న వారికి కనుక్కోవడం చాలా కష్టంగా మారిపోయింది. నాలుగు రోజుల క్రితం అల్పపీడనం ఏర్పడి అది కాస్తా వాయుగుండంగా మారడంతో ప్రజలు హడలిపోయారు. వాయుగుండం తుపానుగా మారే అవకాశం లేదని వాతవరణ శాఖ అధికారులు చెబుతున్నా చెన్నై ప్రజలు మాత్రం భయాందోళనకు గురౌతున్నారు.

     చెన్నైలో 11 అండర్ పాస్లు క్లోజ్

    చెన్నైలో 11 అండర్ పాస్లు క్లోజ్

    చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో వరద నీరు నిలిచిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా చెన్నైలోని 11 అండర్ పాస్ లు, టెన్నల్స్ మూసివేశారు. చెన్నై సిటీలోని వ్యాసర్పాడి, గణేషపురం, అజాక్స్, కెంగురెడ్డి, మాండ్లీ, అరంగనాథన్, పలవంతంగల్, దురైస్వామి, విల్లివాక్కం తదితర టెన్నల్స్ పూర్తిగా మూసివేశారు.

    చెన్నైలో ఈ రోడ్లు పూర్తిగా మూసేశారు

    చెన్నైలో ఈ రోడ్లు పూర్తిగా మూసేశారు

    చెన్నై సిటీలోని ప్రధాన రహదారులను కార్పోరేషన్ అధికారులు పూర్తిగా మూసివేశారు. రాజామన్నార్ రోడ్డు, కేకేనగర్, ఈవీఆర్ రోడ్డు, గాంధీ ఇర్విన్ జంక్షన్ నుంచి డాక్టర్ నాయర్ ఫ్లేఓవర్ వరకు, డాక్టర్ అంబేద్కర్ రోడ్డు, పులియంతోప్పు హైవే, బెటాలియన్ కేజ్ జంక్షన్, రాజా మన్నార్ రోడ్డు, మైలాపూర్- డాక్టర్ శివస్వామి రోడ్డు, పెరవళ్లూరు 70 ఫీట్ రోడ్డు, వ్యాసర్పాడి-ముల్లానగర్ రోడ్డు ఫ్లేఓవర్ తదితర ప్రాంతాల్లోని రహదారులను కార్పోరేషన్ అధికారులు పూర్తిగా మూసివేశారు.

    నానా తిప్పలు పడుతున్న అధికారులు

    నానా తిప్పలు పడుతున్న అధికారులు

    చెన్నైలో కురుస్తున్న వర్షం నీటిని రోడ్ల మీద నుంచి తొలగించడానికి చెన్నై కార్పోరేషన్ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నారు అనే సామెతలాగా భారీ వర్షాలు పడిన సమయంలోనే కార్పోరేషన్ అధికారులు హంగామా చేస్తారు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో ప్రజలు మండిపడుతున్నారు.

    దేవుడా.... మాకే ఎందుకు ఈ కష్టాలు !

    దేవుడా.... మాకే ఎందుకు ఈ కష్టాలు !

    కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది సక్రమంగా పని చెయ్యడం లేదని ఇటీవల కోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఇప్పుడు రహదారుల మీద నిలిచిపోయిన వర్షం నీరు తొలగించడానికి చెన్నై సిటీ కార్పోరేషన్ అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. చెన్నై సిటీ ప్రజలు ఇళ్ల నుంచి రోడ్ల మీదకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మాకే ఎందుకుస్వామి ఈ కష్టాలు అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+