Revenge: సీఎంకు ఫిర్యాదు చేశాడని మేనమామను నడిరోడ్డులో నరికి చంపేసిన అల్లుళ్లు, ఆ మ్యాటర్ లో!
చెన్నై/ సేలం: రక్తసంబంధంలోని రెండు కుటుంబాల మద్య ఆస్తి వివాదం ఉంది. సొంత బందువులు, ఊరి పెద్దలు రాజీ చేసినా ఆస్తి వివాదం పరిష్కారం కాలేదు. రెండు కుటుంబాలు ఆస్తి కోసం కోర్టును ఆశ్రయించారు. ఆస్తి వివాదం కేసు కోర్టులో విచారణలో ఉంది. రెండు కుటుంబాలు రాజీ కాకపోవడంతో కోర్టు చుట్టుతిరుగుతున్నారు. సొంత మామ కారణంగా కోర్టు చుట్టూ తిరగవలసి వచ్చిందని అతని అల్లుళ్లు రగిలిపోయారు. మామను హత్య చెయ్యడానికి అల్లుళ్లు స్కెచ్ వేశారు.
పక్కాప్లాన్ తో బైక్ ల్లో వెళ్లిన యువకులు వాళ్ల మామను నడిరోడ్డులో దారుణంగా నరికి చంపేసి దర్జాగా వెళ్లిపోవడం కలకలం రేపింది. ఇటీవల సీఎంకు మామీద సొంత మామ ఫిర్యాదు చేశారని కోపంతో అతని అల్లుళ్లు దారుంగా హత్య చేశారని పోలీసులు అంటున్నారు.

సొంతమామతో ఆస్తి వివాదం
తమిళనాడులోని సేలం జిల్లాలోని అత్తూరు సమీపంలోని కెంగపల్లిలో రాజేంద్రన్, ఆయన కుమారుడు శ్రీనివాసన్ (42) నివాసం ఉంటున్నారు. ఇదే గ్రామంలో శ్రీనివాసన్ సొంత అక్క, ఆమె భర్త రవిచంద్రన్ నివాసం ఉంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి శ్రీనివాసన్, అతని బావ రవిచంద్రన్ కుటుంబాల మద్య భూవివాదం ఉంది.

పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితంలేదు
రక్తసంబంధంలోని శ్రీనివాసన్, రవిచంద్రన్ కుటుంబాల మద్య చాలా సంవత్సరాల నుంచి ఆస్తి వివాదం ఉంది. సొంత బందువులు, ఊరి పెద్దలు రాజీ చేసినా రవిచంద్రన్, శ్రీనివాసన్ కుటుంబాల మద్య ఆస్తి వివాదం పరిష్కారం కాలేదు. రెండు కుటుంబాలు ఆస్తి కోసం కోర్టును ఆశ్రయించారు. రవిచంద్రన్, శ్రీనివాసన్ కుటుంబాల ఆస్తి వివాదం కేసు కోర్టులో విచారణలో ఉంది.

మేనమామ మీద పగ పెంచుకున్న అల్లుళ్లు
రెండు కుటుంబాలు రాజీ కాకపోవడంతో కోర్టు చుట్టుతిరుగుతున్నారు. రవిచంద్రన్ కు మణికందన్ (31), విజయ్ (28) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సొంత మేనమామ శ్రీనివాసన్ రాజీకాకపొవడంతో మేము కోర్టు చుట్టుతిరుగుతున్నామని, ఆస్తి విక్రయించి ఆ డబ్బుతో వ్యాపారం చెయ్యలేకపోతున్నామని మణికందన్, విజయ్ రగిలిపోయి మేనమామ మీద పగ పెంచుకున్నారు.

సీఎంకు ఫిర్యాదు చేసిన మేనమామ
ఇటీవల శ్రీనివాసన్ తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ కార్యాలయంలో అతని బావ రవిచంద్రన్, అతని కుమారుల మీద ఫిర్యాదు చేశారు. సీఎంకు మామీద సొంత మామ శ్రీనివాసన్ ఫిర్యాదు చేశారని మణికందన్, విజయ్ కోపంతో రగిలిపోయారు. మామ శ్రీనివాసన్ ను హత్య చెయ్యడానికి అతని అల్లుళ్లు మణికందన్, అతని తమ్ముడు విజయ్ స్కెచ్ వేశారు.

మేనమామను నరికి చంపేసిన అల్లుళ్లు
శ్రీనివాసన్ ఇంటి నుంచి బైక్ లో బయలుదేరాడు. పక్కాప్లాన్ తో బైక్ ల్లో వెళ్లిన మణికందన్, విజయ్ వాళ్ల మామ శ్రీనివాసన్ ను నడిరోడ్డులో అడ్డగించారు. సమీపంలో దాచి పెట్టిన వేటకొడవళ్లు తీసుకుని శ్రీనివాసన్ ను దారుణంగా నరికి చంపేసిన విజయ్ అతని అన్న మణికందన్ దర్జాగా వెళ్లిపోవడం కలకలం రేపింది. ఇటీవల సీఎం స్టాలిన్ కు మామీద సొంత మామ శ్రీనివాసన్ ఫిర్యాదు చేశారని కోపంతో అతని అల్లుళ్లు దారుంగా హత్య చేశారని సేలం జిల్లా పోలీసులు అంటున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications