గాన గంధర్వుడు కరోనా కోరల్లో నుంచి బయటపడ్డారా? ఎస్పీ చరణ్ ఏం చెబుతున్నారు?
చెన్నై: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కోరల నుంచి బయటపడ్డారని వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ స్పష్టం చేశారు. అంతకుముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగిటివ్ వచ్చిందని ఇండియా టుడే వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే చక్కర్లు కొట్టిన ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేశారు ఎస్పీ చరణ్.
కరోనా బారిన పడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొద్దిరోజుల కిందట చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. చాలాకాలం పాటు వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స అందించారు డాక్టర్లు. విదేశీ నిపుణులను సైతం రప్పించినట్లు చెబుతున్నారు. వైద్యరంగంలో అత్యంత అరుదుగా చెప్పుకొనే ఎక్స్‌ట్రాకార్పొరియల్ మెంబ్రాన్ ఆక్సిజినేషన్ (ఎక్మో) విధానంలో ఎస్పీ బాలుకు ట్రీట్‌మెంట్ చేశారు.

ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. క్రమంగా కోలుకుంటున్నట్లు ఎంజీఎం వైద్యుల ద్వారా సమాచారం అందినట్లు ఎస్పీ చరణ్ తెలిపారు.గాన గంధర్వుడిగా.. బహుభాషా నటుడిగా వేలాది పాటలను పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సంగీత ప్రియులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ అభిమానులు ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ కోలుకోవాలంటూ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలు సోషల్ మీడియా ద్వారా అకాంక్షించారు.
SP Charan Gives a Clarity and Update about SP Balu Sir Health Status #SPBalasubrahmanyam pic.twitter.com/zcUlBWe7AP
— Nikil Murukan (@onlynikil) August 24, 2020
మీడియాలో వచ్చని వార్తలను ఎస్పీ చరణ్ ఖండించారు. తన తండ్రి ఆరోగ్యం అయితే కాస్త స్థిరంగా ఉన్నట్లు ఎస్పీ చరణ్ చెప్పారు. అదే సమయంలో ఆయనకు కరోనా పాజిటివా లేద నెగిటివా అన్న అంశాన్ని పక్కన పెడితే.. ఆయన కోలుకుంటున్నట్లు మాత్రం ఎస్పీ చరణ్ చెప్పారు. ఏ దైనా సమాచారం ముందుగా వైద్యులు తనకు చెబుతారని వెల్లడించిన చరణ్... ఆ తర్వాతే తాను మీడియాకు ఓక ప్రకటన ద్వారా అప్‌డేట్ అందిస్తానని చెప్పారు. అయితే తన తండ్రి ఆరోగ్యంపై వచ్చే వార్తలను తాను అధికారికంగా ప్రకటించే వరకు నమ్మరాదని పేర్కొన్నారు. ప్రస్తుతం తన తండ్రికి వైద్యులు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారని వీడియో ద్వారా తెలిపారు. తన పేరును ఉటంకిస్తూ జాతీయ మీడియా రాసిన కథనాల్లో వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు.