చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: కరోనా మందుల్లో విషం కలిపి -అప్పు చెల్లించలేక అసాధారణ రీతిలో ఘోర హత్యలు -చివరికిలా..

|
Google Oneindia TeluguNews

కరోనా విలయకాలంలో మెడికల్ మాఫియా బరితెగింపులు, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ తంత్రాలు రోజూ చూస్తున్నవే. నిజంగా వైరస్ కు బలవుతోన్నవారి సంఖ్య నిత్యం వేలల్లోనే ఉంటోంది. కానీ కరోనా సాకుతో దారుణ హత్యలకు ఒడిగట్టిన ఉదంతం తొలిసారిగా తమిళనాడులో చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక, కరోనా నివారణ మందుల్లో విషం కలిపి ముగ్గురిని హత్య చేసిన వైనాన్ని ఈరోడ్ జిల్లా పోలీసులు మీడియాకు వివరించారు..

పొలం లీజు, రూ.15లక్షలు..

పొలం లీజు, రూ.15లక్షలు..


తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని చిన్నిమలై గ్రామానికి చెందిన క‌రుప్ప‌న‌కౌందేర్(72) ఓ మోస్తారు రైతు. అతనికి మ‌ల్లిక‌, కూతురు దీప‌ ఉన్నారు. పనిమనిషి కుప్ప‌ల్ కూడా వారితోనే కలిసుండేది. కీజ్వాని గ్రామానికి చెందిన ఆర్ క‌ల్యాణ‌సుంద‌రం(43)తో కరుప్ప కుటుంబానికి చాలా కాలంగా పరిచయం. ఆ చనువుతోనే కరుప్ప పొలంలో కొంత భాగాన్ని క‌ళ్యాణ‌సుంద‌రం లీజుకు తీసుకున్నాడు. అంతేకాదు, కొన్ని నెల‌ల క్రితం రూ. 15 ల‌క్ష‌లు అప్పు తీసుకున్నాడు.

కరోనా సాకుతో హత్యలకు..

కరోనా సాకుతో హత్యలకు..

పంటల సీజన్ కావడంతో డబ్బు అవసరమై, తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాల్సిందిగా సుంద‌రంపై క‌రుప్ప‌న‌కౌందేర్ ఒత్తిడి చేశాడు. అయితే, అప్పు చెల్లించేందుకు డ‌బ్బు లేక‌పోవ‌డం, లీజుకు తీసుకున్న పొలాన్ని కొట్టేయాలన్న దురాశతో తో క‌ల్యాణ‌సుంద‌రం దుష్టపన్నాగం పన్నాడు. కరోనా సాకుతో క‌రుప్ప‌న‌కౌందేర్ కుటుంబాన్నే హ‌త‌మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. త‌న స్నేహితుడు శ‌బ‌రి(25) స‌హాయంతో భారీ స్కెచ్ వేశాడు.

హెల్త్ వర్కర్ వేషంలో వెళ్లి..

హెల్త్ వర్కర్ వేషంలో వెళ్లి..


ఈనెల 26న కరుప్ప, అతని కుటుంబం పొలంలో పనులు చేసుకుంటుండగా, కల్యాణసుందరం కూడా అక్కడే చేరాడు. సరిగ్గా అదే సమయంలో కరోనా టెస్టులు చేస్తామంటూ హెల్త్ వ‌ర్క‌ర్‌గా అవ‌తార‌మెత్తిన శబరి అక్కడికొచ్చాడు. టెంప‌రేచ‌ర్ చెక్ చేసి.. క‌రోనా నివార‌ణ‌కు మందులు ఇస్తున్నాన‌ని, ఇవి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయ‌ని చెప్పి కొన్ని మందుల‌ను ఇచ్చాడు. కానీ అవి మెడిసిన్స్ కాదు.. విషంతో కూడిన మందులు.

విషం కలిపిన కరోనా మాత్రలు..

విషం కలిపిన కరోనా మాత్రలు..


నకిలీ హెల్త్ వర్కర్ శబరి ఇచ్చిన విషపు మందుల్ని కరోనా మాత్రలుగా భావించి క‌రుప్ప‌న, అతని భార్య మ‌ల్లిక‌, కూతురు దీప‌, ప‌ని మ‌నిషి కుప్ప‌ల్ వాటిని తీసుకున్నారు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికే వారు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. బాధితుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. మ‌ల్లిక చ‌నిపోయింది. దీప‌, కుప్ప‌ల్ మ‌రుస‌టి రోజు మ‌ర‌ణించారు. క‌రుప్ప‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సుంద‌రం, శ‌బ‌రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు కథ బయటపడింది.

English summary
In a shocking incident, three members of a family died in Tamil Nadu’s Erode after they were given poison in the guise of Covid-19 cure pills. Police have arrested two people in connection with the case. Investigations revealed that the main accused, R Kalyanasundaram (43) of Keezhvani village, had borrowed Rs 15 lakh from Karuppanakounder (72) of Karungoundanvalasu village a few months ago. Unable to repay the loan and facing pressure from the moneylender, Kalyanasundaram decided to get rid of Karuppanakounder and his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X