చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

E-Budget: సీఎం దెబ్బతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్, మొదటి సారే షాక్, మర్యాద లేనప్పుడు ఇక్కడెందుకు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టిన తమిళనాడు ప్రభుత్వం ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం మొదటిసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఈ-బడ్జెట్ కావడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కంప్యూటర్ లో బడ్జెట్ ను ఎలా చదువుకోవాలి అంటూ స్పీకర్ సలహాలు, సూచనల గురించి స్పీచ్ ఇస్తున్న సమయంలో మాజీ సీఎంతో పాటు ప్రతిపక్ష నాయులు అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలు వారి గోడు వెళ్లబోసుకుంటున్న సమయంలో ఎంకే. స్టాలిన్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ప్రతిపక్షాలు వారి గోల వారు వినిపిస్తుంటే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. మాకు మర్యాదలేని ఈ అసెంబ్లీలో మేము ఎందుకు ? అంటూ మాజీ సీఎం, మాజీ ఉప ముఖ్యమంత్రితో పాటు మాజీ మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ నుంచి బైకాట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

మేము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇదే పని చేశాము అనుకున్నారో ఏమో కాని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలో నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వెయ్యలేదు.

Wife: మాట్లాడితే బయటకు చెక్కేస్తున్న భార్య, చేతిపారతో చెక్కేసిన భర్త, శవం ఒంటరిగా ఉంది తెచ్చుకోండి !Wife: మాట్లాడితే బయటకు చెక్కేస్తున్న భార్య, చేతిపారతో చెక్కేసిన భర్త, శవం ఒంటరిగా ఉంది తెచ్చుకోండి !

స్టాలిన్ ప్రభుత్వం డిసైడ్

స్టాలిన్ ప్రభుత్వం డిసైడ్

తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ భారీ మెజారిటీ ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చింది. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ప్రతిపక్షంలో కుర్చుంది. తమిళనాడులో అధికారంలోకి వచ్చిన ఎంకే. స్టాలిన్ ప్రభుత్వం మొదటిసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ప్రత్యేకత చాటుకుంది. అసెంబ్లీలో ఈ - బడ్జెట్ ప్రవేశ పెట్టాలని స్టాలిన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

దెబ్బతో మైండ్ బ్లాక్

దెబ్బతో మైండ్ బ్లాక్

శ్రావణమాసం మొదటి శుక్రవారం (ఈరోజు) తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్ ఆ రాష్ట్ర 2021-2022 బెడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కాగితరహిత బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ సిద్దం కావడంతో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కాగితరహిత ఈ- బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి స్టాలిన్ ప్రభత్వం సిద్దం కావడంతో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు మైండ్ బ్లాక్ అయ్యింది.

కంప్యూటర్ లో చూసుకోండి అంటూ స్పీచ్ ఇచ్చిన స్పీకర్

కంప్యూటర్ లో చూసుకోండి అంటూ స్పీచ్ ఇచ్చిన స్పీకర్

తమిళనాడులో అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎంకే ప్రభుత్వం మొదటిసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఈ-బడ్జెట్ కావడంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కంప్యూటర్ లో బడ్జెట్ ను ఎలా చదువుకోవాలి అంటూ తమిళనాడు స్పీకర్ సలహాలు, సూచనల గురించి స్పీచ్ ఇచ్చారు. ఆసమయంలో బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో మా అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ ఫ్లోర్ లీడర్ ఎడప్పాడి పళనిస్వామి స్పీకర్ కు మనవి చేశారు.

ఎడప్పాడి పళనిస్వామికి చాన్స్ ఇవ్వాలని!

ఎడప్పాడి పళనిస్వామికి చాన్స్ ఇవ్వాలని!

బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆయన అభిప్రాయాలు చెప్పడానికి లేచి నిలబడ్డారు. అదే సమయంలో ఎడప్పాడి పళనిస్వామికి మద్దతుగా మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ, పీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు.

ఇది టైమ్ కాదు ఫ్రెండ్స్.... తరువాత చెప్పండి

ఇది టైమ్ కాదు ఫ్రెండ్స్.... తరువాత చెప్పండి

ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ రోజు మీ అభిప్రాయాలు చెప్పడానికి కుదరదని, చర్చలు జరిగే రోజుల్లో మీకు అవకాశం ఇస్తామని, ఇప్పుడు కుర్చోవాలని, ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అవకాశం ఇవ్వాలని తమిళనాడు స్పీకర్ మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామికి మనవి చేశారు.

మాకు మర్యాద లేనప్పుడు ఇక్కడ మేము ఎందుకు ?

మాకు మర్యాద లేనప్పుడు ఇక్కడ మేము ఎందుకు ?

ప్రతిపక్ష నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమయంలో తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పళనివేల్ త్యాగరాజన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సిద్దం అయ్యారు. ఆ సమయంలో మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామితో పాటు ప్రతిపక్ష నాయులు అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు వారి గోడు వెళ్లబోసుకుంటున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టింది.

ప్రతిపక్షాలు వారి గోల వారు వినిపిస్తుంటే తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. మాకు మర్యాదలేని ఈ అసెంబ్లీలో మేము ఎందుకు ? అంటూ మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు మాజీ మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ నుంచి బైకాట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆ రోజు మేము ఇలాగే చేశాము..... పోతేపోండి

ఆ రోజు మేము ఇలాగే చేశాము..... పోతేపోండి

అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మేము ప్రతిపక్షంలో ఉన్నామని, ఆ సమయంలో మేము ఇదే పని చేశాము అనుకున్నారో ఏమో కాని అధికార పార్టీకి చెందిన డీఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలో నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వెయ్యలేదు. మొత్తం మీద స్టాలిన్ ప్రభుత్వం మొదటి సారి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ బడ్జెట్ కావడం హాట్ టాపిక్ అయ్యింది.

అసెంబ్లీ నుంచి బైకాట్ చేసి బయటకు వచ్చిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ బడ్జట్ ప్రవేశపెట్టిన ఈ డీఎంకే ప్రభుత్వం పేద ప్రజలకు ఎలాంటి న్యాయం చెయ్యలేదని ఎడప్పాడి పళనిస్వామి మండిపడ్డారు.

English summary
Tamil Nadu Budget 2021-22: The first E Budget will be presented today by TN Finance Minister PTR Palanivel Thiyagarajan. AIADMK boycott from TN Budget and Edapadi Palanisamy gave explanation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X