అక్రమ సంబంధం ఎఫెక్ట్, భార్య ముఖం మీద వేడివేడి సాంబార్ పోసిన భర్త, క్లైమాక్స్ లో?
బెంగళూరు: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భార్య చూడటానికి ఎర్రగా, బుర్రగా ఉంటోంది. మొదట తాను ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పిన భర్త తరువాత రూట్ మార్చాడు. దంపతుల మధ్య అక్రమ సంబంధం విషయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి. గ్యాస్ స్టౌవ్ మీద వేడిగా కాగుతున్న సాంబర్ ఎత్తుకుని భార్య ముఖం మీద పోసిన భర్త అతని పగ తీర్చుకున్నాడు.
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని తిరువెన్నలూర్ సమీపంలోని తడతాటకొండరూర్ ప్రాంతంలో ఆరోగ్యస్వామి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెరియనాయకన్ అలియాస్ మేరీ అనే మహిళను ఆరోగ్యస్వామి వివాహం చేసుకున్నాడు. మేరీ చూడటానికి ఎర్రగా, లావుగా ఉంటోంది.

పెళ్లి సమయంలో ఆరోగ్యస్వామి మేరీని చాలా సంతోషంగా పెళ్లి చేసుకున్నాడని ఇరు వైపుల కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే వివాహం జరిగిన తరువాత ఆరోగ్యస్వామి అతని భార్య మేరీని నువ్వు లావుగా ఉన్నావని ఆమెను కించపేరిచే విధంగా మాట్లాడేవాడని ఆరోపణలు ఉన్నాయి. తరువాత భార్య మేరీతో ఆరోగ్యస్వామి అంటిముట్టనట్లు వ్యవహరించాడని తెలిసింది.
భార్య మేరీకి దూరంగా ఉంటున్న ఆరోగ్యస్వామి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ప్రియురాలు నాజుకుగా ఉండటంతో ఆరోగ్యస్వామి ఆమెకే అంకితం అయిపోయాడు. తన భర్తకు అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న అతని భార్య మేరీ అలియాస్ పెరియనాయకన్ ఇంట్లో గొడవలు పెట్టుకుంది.

కొంతకాలంగా భర్త ఆరోగ్యస్వామి అక్రమ సంబంధం విషయంలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రాత్రి ప్రియురాలితో ఎంజాయ్ చేసి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన ఆరోగ్యస్వామితో అతని భార్య మేరీ ఇదే విషయంలో గొడవపడింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఆరోగ్యస్వామి గ్యాస్ స్టౌవ్ మీద వేడివేడిగా కాగుతున్న సాంబర్ డేక్షా తీసుకుని వెళ్లి భార్య మేరీ ముఖం మీద పోసేశాడు.
వేడి సాంబర్ ముఖం మీద, శరీరం మీద పడటంతో తీవ్రగాయాలైన మేరీని ఆసుపత్రికి తరలించారు. మేరీ మీద సాంబర్ పోసిన ఆరోగ్యస్వామి అక్కడి నుంచి పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ సంబంధం కారణంగా భార్య మేరీ ముఖం మీద ఆమె భర్త సాంబర్ పోయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications