Chithra: నువ్వు రంకులాడివే, చస్తే పీడపోతుంది, ఛీ, రిజిస్టర్ మ్యారేజ్ మొగుడి టార్చర్, హోటల్ లో అలా!

చెన్నై: తమిళ బుల్లి తెర బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుని తమిళ ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిపోయిన నటి చిత్ర ఆత్మహత్య కేసు విచారణ వేగవంతం అయ్యింది. స్టార్ హోటల్ లో చిత్రను ఆమె భర్త హేమనాథ్ నువ్వు రంకులాడివే, చస్తే పీడపోతుంది అంటూ చిత్రహింసలు పెట్టి, మానసికంగా హింసించడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నువ్వెంత, నీ బతుకెంత ?, నాతోనే పెట్టుకుంటావా ?, నీ రంకు పురాణం మొత్తం బయటపెడుతా ? అంటూ చిత్రను హేమనాథ్ టార్చర్ పెట్టాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఆర్డీవో దివ్యశ్రీ ఎంట్రీ

ఆర్డీవో దివ్యశ్రీ ఎంట్రీ

బుల్లితెర నటి చిత్ర ఆత్మహత్య కేసులో ఇప్పటికే పెరంబదూరు ఆర్డీవో దివ్యశ్రీ రంగంలోకి దిగి చిత్ర కుటుంబ సభ్యులను విచారణ చేసి ప్రాథమిక నివేదిక సిద్దం చేశారు. హేమనాథ్ తల్లి వసంత, తండ్రి రవిచంద్రన్ లను ఆర్డీవో దివ్యశ్రీ వేర్వేరుగా విచారణ చేసి వారి చెప్పిన సమాచారాన్ని రికార్డు చేసుకున్నారు. చిత్ర తల్లిదండ్రులు కామరాజ్, విజయ, సోదరి సరస్వతి, సోదరుడు శరవణ్ ను విచారణ చేసిన పెరంబదూరు ఆర్డీవో దివ్యశ్రీ వారి వివరాలను రికార్డు చేసుకున్నారు. ఇప్పటికే ఆర్డీవో దివ్యశ్రీ ఓ నివేదిక తయారు చేశారని తమిళ మీడియా స్పష్టం చేసింది.

సెంట్రల్ జైల్లో సార్

సెంట్రల్ జైల్లో సార్

చిత్ర ఆత్మహత్య కేసులో అరెస్టు అయిన ఆమె భర్త హేమనాథ్ పొన్నేరి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి హేమనాథ్ ను మరోసారి అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని పోలీసులు సిద్దం అయ్యారు. కోర్టు అనుమతితో హేమనాథ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని పోలీసులు సిద్దం అయ్యారు. హేమనాథ్ దగ్గర పని చేస్తున్న కొందరు ఉద్యోగులను ఇప్పటికే పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు.

 లాక్ డౌన్ లో ఖాళీగా ఉన్నారని లవ్

లాక్ డౌన్ లో ఖాళీగా ఉన్నారని లవ్

పాండియన్ స్టోర్స్ ముల్ లై పాత్రధారిణిగా చిత్ర చాలా ఫేమస్ అయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న హేమనాథ్ తో చిత్రకు పరిచయం అయ్యింది. కరోనా వైరస్ కాలంలో లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ లు లేకపోవడంతో ఇంట్లో ఖాళీగా ఉన్న చిత్ర తన స్నేహితుడు హేమనాథ్ తో ప్రేమలో పడింది. లాక్ డౌన్ సడలింపులతో గత ఆగస్టు నెలలో చిత్ర, హేమనాథ్ ల నిశ్చితార్థం జరిగింది.

రిజిస్టర్ మ్యారేజ్ మొగుడు

రిజిస్టర్ మ్యారేజ్ మొగుడు

నిశ్చితార్థం చేసుకున్న తరువాత చిత్ర తిరువాన్నీయూరులో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో బిజీ అయ్యింది. అదే విదంగా పగలు, రాత్రి అని తేడా లేకుండా టీవీ సీరియల్స్ షూటింగ్ బిజీలో చిత్ర తలమునకలైయ్యింది. ఆ సమయంతో తనతో నిశ్చితార్థం చేసుకున్న తరువాత చిత్ర నడవడికలో మార్పు వస్తోందని గమనించిన హేమనాథ్ ఆమెను బలవంతం చేసి సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు.

షూటింగ్ స్పాట్ లో హంగామా

షూటింగ్ స్పాట్ లో హంగామా

చిత్ర ఆత్మహత్య చేసుకునే రోజు (డిసెంబర్ 9వ తేది) చెన్నై శివార్లలో షూటింగ్ కు వెళ్లింది. షూటింగ్ స్పాట్ కు వెళ్లిన హేమనాథ్ చిత్ర మీద చిందులు వేసి ఆమెను అక్కడి నుంచి కారులో పిలుచుకుని వెళ్లాడు. కారులోనే చిత్ర, హేమనాథ్ ల మద్య తీవ్రస్థాయిలో గొడవ జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. షూటింగ్ స్పాట్ నుంచి కారులో గొడవ పడుతూ చిత్ర, హేమనాథ్ నేరుగా చెన్నైలోని ఓ స్టార్ హోటల్ కు చేరుకున్నారు.

నువ్వెంత ? నీ బతుకెంత... చావు... పీడపోతుంది

నువ్వెంత ? నీ బతుకెంత... చావు... పీడపోతుంది

డిసెంబర్ 9వ తేదీ చెన్నైలోని ఓ స్టార్ హోటల్ గదిలో గట్టిగా తలుపులు వేసిన హేమనాథ్ చిత్రను బూతులు మాట్లాడాడని, నువ్వు బజారు మనిషివి, నీకు సిగ్గూషరం లేదని, నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు చస్తే పీడపోతుందని గట్టిగా కేకలు వేసి ఆ గదిలో నుంచి బయటకు వెళ్లిపోయాడని, తరువాత ఆవేదనతో చిత్ర ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మొదట పొంతనలేని సమాధానాలు చెప్పిన హేమనాథ్ కు పోలీసులు సరైన ట్రీట్ మెంట్ ఇవ్వడంతో హోటల్ లో జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడని వెలుగు చూసింది. జైల్లో ఉన్న హేమనాథ్ ను మరోసారి విచారణ చెయ్యడానికి చెన్నై సిటీ పోలీసులు సిద్దం అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+