Wife: కాలేజ్ లవర్స్, లవ్ మ్యారేజ్, మద్యలో మ్యాటర్ రివర్స్, అరటి పండు కోసం భర్తను చంపేసిన భార్య!
చెన్నై/ తిరుచ్చి: కాలేజ్ లో చదువుకునే సమయంలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. రోజూ కాలేజ్ లో కలుసుకుంటున్న ఇద్దరూ ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాలు కాలేజ్ లో లవర్స్ గా అందరికి నోటెడ్ అయ్యారు. తరువాత ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న సమయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పంచాయితీలు చెయ్యడానికి పెద్దలు కూడా వీళ్లకు సహకరించలేదు.
ఇదే సమయంలో భార్య మీద విపరీతంగా అనుమానం పెంచుకున్న భర్త మద్యం తాగడానికి బానిస అయ్యి అతని ఫ్యామిలీ గురించి పట్టించుకోవడం మానేశాడు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన భర్త అతని భార్య మీద చిందులు వేశాడు. ఇంతకాలం ఓపికగా ఉన్న భార్య కత్తి తీసుకుని భర్తను కసక్ అని పొడిచి చంపేసింది.

కాలేజ్ లవర్స్
తమిళనాడులోని తిరుచ్చిలో సుబ్బారావుపురంలో దినేష్ రాజశేఖరన్ అలియాస్ దినేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాలేజ్ లో చదువుకునే సమయంలో దినేష్ కు లావణ్యా (26) అనే యువతి పరిచయం అయ్యింది. రోజూ కాలేజ్ లో కలుసుకుంటున్న దినేష్, లావణ్యా ప్రేమించుకున్నారు.

లవ్ మ్యారేజ్
మూడు సంవత్సరాలు కాలేజ్ లో దినేష్, లావణ్యా లవర్స్ గా అందరికి నోటెడ్ అయ్యి హ్యాపీగా తిరిగేశారు. నాలుగు సంవత్సరాల క్రితం దినేష్, లావణ్య పెళ్లి చేసుకున్నారు. లావణ్య, దినేష్ దంపతులకు రెండు సంవత్సరాల వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత దినేష్ అతని భార్య లావణ్యాతో సంతోషంగా ఉన్నా ఇటీవల పరిస్థితులు రివర్స్ అయ్యాయి.

భార్య మీద అనుమానం... భర్త తాగుడుకు బానిస
పెళ్లి చేసుకుని కొంతకాలం సంతోషంగా కాపురం చేస్తున్న సమయంలో దినేష్ చెడుతిరుగుడు తిరగడం మొదలుపెట్టాడు. ఇదే విషయంలో దినేష్, లావణ్యా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పంచాయితీలు చెయ్యడానికి పెద్దలు కూడా దినేష్, లావణ్యాలకు సహకరించలేదు. ఇదే సమయంలో భార్య లావణ్యా మీద విపరీతంగా అనుమానం పెంచుకున్న దినేష్ రోజూ మద్యం తాగడానికి బానిస అయ్యి అతని ఫ్యామిలీ గురించి పట్టించుకోవడం మానేశాడు.

ఆరటి పండు కోసం గొడవ మొదలైయ్యింది
రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన దినేష్ ను బిడ్డకు అరటి పండు, ఇంటికి సరుకులు తీసుకురావాలని లావణ్యా చెప్పింది. అయితే అరటి పండుతో పాటు సరుకులు తీసుకురావడానికి దినేష్ నిరాకరించాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది. మద్యం మత్తులో ఇంట్లోనే దినేష్ అతని భార్య లావణ్యా మీద చిందులు వేశాడు.

భర్తను పొడిచి చంపేసిన భార్య
ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో కత్తి తీసుకున్న లావణ్యా లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్త దినేష్ ను పొడిచేసింది. తీవ్రగాయాలైన దినేష్ ను ఆసుపత్రికి తరలించారు. అయిత చికిత్స విఫలమై దినేష్ చనిపోయాడని పోలీసులు అన్నారు. భర్త దినేష్ ను హత్య చేసిందని అతని భార్య లావణ్యాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని తిరుచ్చి పోలీసు అధికారులు తెలిపారు.
-
సమ్మర్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే రావాలనిపించదు.. తక్కవ బడ్జెట్ లో ఇలా చుట్టేయండి.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications