చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

20 మందు బాటిళ్లు.. తిరుమలకు తీసుకెళ్తూ.. పట్టుబడ్డ సివిల్ వర్కర్.. అరెస్ట్

|
Google Oneindia TeluguNews

పుణ్యక్షేత్రాలలో లిక్కర్ తాగడం, సిగరేట్ స్మోక్ చేయడం నిషిద్దం. కానీ కొందరు మాత్రం నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఇటీవల పర్యాటక కేంద్రం తాజ్ మహల్ సమీపంలో ఓ మహిళ బీడీ తాగడం చూశాం. అదీ వైరల్ అయ్యింది. సమీపంలో మందు బాటిల్ కూడా లభించింది. అయితే ఇప్పుడు తిరుమల వంతు వచ్చింది. అక్కడ మద్యం సీసాలు లభించాయి.

పట్టబడిన మద్యం..

పట్టబడిన మద్యం..

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, తిరుమల శ్రీవారి పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం సీసాలు కనిపించాయి. అలిపిరిలో భారీగా మద్యం పట్టుబడింది. తిరుమలకు తరలిస్తున్న 20 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర బెంగళూరుకి చెందిన వెంకటేశ్ నుంచి మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. వెంకటేశ్ తిరుమలలో సివిల్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. అతడిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు అప్పగించారు.

20 బాటిళ్లు

20 బాటిళ్లు

ఎన్నడూ లేని విధంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద మద్యం బాటిళ్లు లభించాయి. బెంగళూరుకి చెందిన వెంకటేశ్ తిరుమలలో ఓ కాంట్రాక్టర్ వద్ద సివిల్ వర్కర్‌గా పని చేస్తాడు. వెంకటేశ్ తిరుమలకు వెళ్తూ 20 మద్యం బాటిళ్లు తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. మద్యం తరలిస్తుండగా పట్టుబడటం గత వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం విశేషం.

గట్టి నిఘా.. అయినప్పటికీ

గట్టి నిఘా.. అయినప్పటికీ

తిరుమలలో గట్టి నిఘా ఉంది. అయినప్పటికి మద్యం సరఫరా కావడం చర్చకు దారితీసింది. మరికొందరు తిరుమలకు గుట్టుగా మద్యం తరలిస్తున్నారు. మద్యం సేవించడం, అమ్మడం నేరం. యథేచ్చగా అలా చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్న.. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. కొందరీ తీరు మాత్రం మారడం లేదు. మద్యం తరలిస్తూ.. పుణ్యక్షేత్రాలకు మచ్చ తీసుకు వస్తున్నారు.

English summary
20 liquor bottles seized in alipiri. the culprit is civil worker venkatesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X