క్షమాపణ చెప్పిన నందమూరి బాలకృష్ణ..!!
చిత్తూరు: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహా రెడ్డి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ కేరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కలెక్షన్ల ఊచకోత కోస్తోంది. తొలి రోజే 54 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసిందీ మూవీ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. బాలయ్య డ్యుయెల్ రోల్ చేశారు. శృతి హాసన్ హీరోయిన్.

నారావారిపల్లిలో..
ప్రస్తుతం బాలకృష్ణ కుటుంబం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో సందడి చేస్తోంది. తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత ఊరిలో సంక్రాంతి పండగను సంబరాల్లో పాల్గొన్నారు బాలకృష్ణ. వీరసింహారెడ్డి సినిమా విడుదలైన మరుసటి రోజే ఆయన నారావారిపల్లికి చేరుకున్నారు. ఆయన తనయుడు మోక్షజ్ఞ ఈ సెలబ్రేషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇంకా తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వలేదీ నందమూరి కుర్రాడు. మోక్షజ్ఞ అరంగేట్రం కోసం అభిమానులు ఎదురు చూస్తోన్నారు.

కనుమ కూడా అక్కడే..
పండగ వేడుకలు ముగిసిన అనంతరం బాలకృష్ణ.. తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు. అనంతరం ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2లో పాల్గొంటారు. పవన్ కల్యాణ్ తో షూట్ చేసిన ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇవ్వాళ విడుదలైంది. నందమూరి, పవన్ కల్యాణ్ అభిమానులకు సంక్రాంతి గిఫ్ట్ ను ఇచ్చిందీ ప్రొమో.

క్షమాపణ చెప్పిన బాలయ్య..
కాగా- నందమూరి బాలకృష్ణ ఓ వివాదం చిక్కుకున్నారు. దేవ బ్రాహ్మణ సామాజిక వర్గంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి క్షమాపణలు చెప్పారు. రావణబ్రహ్మను దేవ బ్రాహ్మణులకు మూల పురుషుడిగా అభివర్ణించారాయన. దీనిపై ఆ సామాజిక వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. వారికి క్షమాపణలు చెబుతూ నోట్ విడుదల చేశారు.

ఆ సమాచారం తప్పు..
దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అంటూ తనకు అందిన సమాచారం తప్పు అని పేర్కొన్నారు. ఆ సమాచారం మేరకే తాను ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరించారు. దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని బాలకృష్ణ తెలిపారు. తాను చెప్పిన మాటల వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డానని నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదన్న బాలకృష్ణ.. దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో వచ్చిన మాట మాత్రమేనని... అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల తనకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి అని వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications