ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పీలేరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయిన వాయల్పాడు నియోజకవర్గం లోని గుర్రంకొండ, కలకడ, కలికిరి, వాయల్పాడు, కెవి పల్లె మండలాలు పీలేరు నియోజకవర్గంలో చేరాయి. ఉమ్మడి ఏపి చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. అంతకు ముందు వాయల్పాడు నియోకవర్గం నుండి మూడు సార్లు గెలిచారు. కిరణ్ తండ్రి అమరనాధరెడ్డి సైతం వాయల్పాడు నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడి నుండి మూడు సార్లు..పుంగనూరు లో ఒకసారి గెలుపొందారు. ఇదే జిల్లా నుండి చంద్రబాబు టిడిపి లో ముఖ్యమంత్రి కాగా, కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక, కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
14 సార్లు ఎన్నికలు..కాంగ్రెస్ కే ఆధిక్యం..
పీలేరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ నుండి ఏడు సార్లు, టిడిపి మూ డు సార్లు,కెఎల్‌పి రెండు సార్లు, సిపిఐ ఒక సారి గెలిచాయి. ఒక్కడ ఒకసారి గెలిచిన పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి వాల్పాడు లో మూ డు సార్లు గెలుపొందారు. తిమ్మారెడ్డి గతంలో నీలం, కాసు మంత్రివర్గాల్లో పని చేసారు. పిసిసి అధ్యక్షుడిగా పని చేసారు. సైఫుల్లాబేగ్, చల్లా ప్రభాకర రెడ్డి రెండేసి సార్లు విజయం సాధించారు. 209 ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ పదవి దక్కించుకున్నారు. ఆ తరువాత రోశయ్య ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవటం తో ముఖ్యమంత్రిగా కిరణ్ కు అవకాశం దక్కింది. రాష్ట్ర విభజన వ్యతిరేకించిన కిరణ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు.

2014 ఎన్నికల్లో వైసిపి గెలుపు..
2014 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 215226 ఓట్లు ఉండగా, అందులో 168842 ఓట్లు పోలయ్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డికి 71942 ఓట్లు రాగా, సమైక్యాంధ్ర నుండి పోటీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డికి 56636 ఓట్లు వచ్చాయి. వైసిపి నుండి పోటీ చేసిన రామచంద్రారెడ్డికి 15306 మెజార్టీ దక్కింది. 2014 ఎన్నికల తరువాత ఇక్కడ సమైక్యాంధ్ర పార్టీ నుండి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరారు.
వచ్చే ఎన్నికల్లో వీరే అభ్యర్ధులుగా..
ఇక, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలించేందుకు టిడిపి - వైసిపి వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తిరిగి వైసిపి నుండి పోటీ చేయనున్నారు. టిడిపి నుండి తాజాగా పార్టీలో చేరిన కిషోర్ కుమా ర్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన సిట్టంగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డికి 44197 ఓట్లు వచ్చాయి. మరి..పవన్ కళ్యాన్ ఇక్కడి నుండి తమ పార్టీ అభ్యర్దిగా ఎవరిని బరిలోకి దింపుతారనేది వేచి చూడాలి. ఇక్కడ పోటీ మాత్రం నల్లారి కుటుంబానికి కీలకం కానుంది. వైసిపి - టిడిపి మధ్య కీలక పోటీ జరగటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications