చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పదవీ నుంచి తీసేస్తే -- సమానం.. డేంజర్ గాడిని, కేసులు ఉండవ్, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అవును రాజకీయ నేతల మాదిరిగా.. కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జాబితాలో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ చేరారు. ఆయన ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవీ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ వాళ్లను నమ్మొద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మన భూములను దోచుకుంటున్నారని విరుచుకుపడ్డారు. హక్కులను హరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో గల సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో జరిగిన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ చేశారు. తర్వాత విక్టర్‌ ప్రసాద్ మాట్లాడారు. అంతేకాదు పదవీ నుంచి తనను తొలగిస్తే అంటూ రెచ్చిపోయారు. తర, తమ అనే భేదం లేకుండా అందరినీ ఏకిపారేశారు.

ap sc corporation chairman made controversial comments

తనను పదవీ నుంచి తొలగిస్తే కొన్ని వందల అమలాపురాలను సృష్టిస్తానని కామెంట్ చేశారు. అంటే హింసను ప్రోత్సహిస్తానని చెప్పారు అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్టులు లేవన్నారు. అంటే తాము విధ్వంసం సృష్టిస్తాం కానీ.. అరెస్ట్ చేయబోరని కామెంట్ చేశారు. అంతేకాదు తాను డేంజర్‌గాడినని అందరూ తీసేయమంటున్నారు. పదవీ నుంచి తీస్తే తన వెంట్రుకతో సమానం అన్నారు. అంతే తనకు పదవీ కూడా లెక్క కాదని మండిపడ్డారు.

తనను పదవీ నుంచి తీస్తే వీధుల్లోకి వచ్చి విజృంభిస్తానని చెప్పారు. కొన్ని వందల అమలాపురాలను సృష్టిస్తానని పేర్కొన్నారు. ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. తనకు పదవీ ముఖ్యం కాదు అంటూనే.. ఆ పదవీ కోసం ఏమైనా చేస్తానని చెప్పారు. ఎస్సీలు అయినందున అరెస్టులు కూడా ఉండవని కామెంట్ చేయడం వివాదానికి కారణమైంది.

English summary
andhra pradesh sc corporation chairman marumidi victor prasad made controversial comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X