చిత్తూరులో రోడ్డు ప్రమాదం... 12 మంది మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది స్పాట్‌లోనే చనిపోయారు. పలమనేరు సమీపంలో మొగిలి ఘాట్ రోడ్డులో కంటైనర్ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం లోని బెంగళూరు జాతీయా రహాదారిపై వద్ద ఓ కంటైనర్‌కు బ్రేకులు ఫెయిల్ కావడంతో బోల్తాపడింది.

దీంతో రోడ్డుపై వెళుతున్న ఆటో వ్యాన్, మరో ద్విచక్ర వాహనంపై దూసుకువెళ్లింది. దీంతో ఆటోతోపాటు, వ్యాన్‌లో వెళుతున్న వారితో కంటైనర్ డ్రైవర్ కూడ అక్కడికక్కడే మృతి చెందారు.

 At least 12 people died in road accident in Chittoor district.

మరికోందరికి తీవ్రగాయాలు కావడంతో పలమనేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. వీరిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సంఘటన జరిగినప్పుడు అంతా చీకటీమయంగా ఉండడంతో మృతులను గుర్తించడం కష్టతరంగా మారింది.

సంఘటన స్థలంలోనే 12 మృతదేహాలను వెలికితీసినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎనిమిది మంది పురుషులు ఉండగా, నలుగురు మహిళలు ఉన్నారు. కాగా సంఘటనా స్ధలానికి హుటాహుటిన జిల్లా కలెక్టర్ భరత్ గుప్త చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా మృతులు వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+