చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి పెద్దిరెడ్డితో నిమ్మగడ్డ వార్: ఆ రెండు నియోజకవర్గాలపై టార్గెట్: 30 మంది బదిలీ

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో పర్యటిస్తోన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. అదే జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనతో ఓ మినీ యుద్ధాన్ని ఆరంభించినట్లు కనిపిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న పుంగనూరుతో పాటు ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గం తంబళ్లపల్లిపై టార్గెట్ చేసినట్లు సమాచారం.

మంత్రి పెద్దిరెడ్డి సూచనలను నిమ్మగడ్డ పాటిస్తారా?: చంద్రబాబు సొంత జిల్లా టూర్‌కు ఎస్ఈసీమంత్రి పెద్దిరెడ్డి సూచనలను నిమ్మగడ్డ పాటిస్తారా?: చంద్రబాబు సొంత జిల్లా టూర్‌కు ఎస్ఈసీ

30 మంది ఎంపీడీఓల బదిలీకి..

30 మంది ఎంపీడీఓల బదిలీకి..

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 30 మంది ఎంపీడీఓలను బదిలీ చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్..ప్రభుత్వాన్ని ఆదేశించారు. జిల్లా మొత్తం మీద 65 మంది ఎంపీడీఓలు ఉండగా.. వారిలో సగం మందిని బదిలీ వేటు వేయాలంటూ సూచించారు. గత ఏడాది నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ ఎంపీడీఓలు.. ఏకగ్రీవాలను ప్రోత్సహించారనేది ఆరోపణ. అప్పట్లో రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన వారంతా అక్రమంగా.. నిబంధనలకు విరుద్ధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, ఈ కారణంతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా బదిలీ వేటు వేయాలని ఆదేశించినట్లు చెబుతున్నారు.

 పుంగనూరు, తంబళ్లపల్లిల్లో ఆరుమంది చొప్పున జెడ్పీటీసీలు..

పుంగనూరు, తంబళ్లపల్లిల్లో ఆరుమంది చొప్పున జెడ్పీటీసీలు..

ఆ తరువాత కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అప్పట్లో పుంగనూరు, తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఆరుమంది చొప్పున జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో మరో నలుగురు జెడ్పీటీసీలు ఏకగ్రీం అయ్యారు. 858 ఎంపీటీసీ స్థానాలకు 433 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి కూడా ఎంపీడీఓలే కారణమని ఎస్ఈసీ భావిస్తోంది. వారిని బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ కారణం వల్లే కలెక్టర్‌పైనా

ఈ కారణం వల్లే కలెక్టర్‌పైనా


జెడ్పీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కారణం అయ్యారనే ఉద్దేశంతోనే చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తాను కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బదిలీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భరత్ గుప్తాను బదిలీ చేశారు. ఆయనను గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. నారాయణ్ భరత్ గుప్తా స్థానంలో హరి నాారాయణ్‌ను చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా నియమించారు. ఈ సారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిఘా వేశారు. బలవంతపు ఏకగ్రీవాలను ప్రోత్సహించేది లేదంటూ ఆయన చెబుతున్నారు.

Recommended Video

#TOPNEWS : #IndiaTogether- Rihanna, Mia Khalifa లాంటోళ్లకు Amit Shah కౌంటర్

English summary
Chittoor: Out of 65 MPDOs in the district, 30 MPDOs have got transfer orders as per the instructions of State Election Commissioner Nimmagadda Ramesh Kumar. Out of 65 ZPTCs in the district, the MPDOs declared 30 seats as unanimous in the last ZPTC and MPTC polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X