పరువు హత్య.. కూతురు ప్రేమించిన యువకుడి మర్డర్.. నాలుగు ముక్కలు చేసి..
కాలం మారింది.. మారుతోంది. కానీ కొందరు మాత్రం మారడం లేదు. కులం, మతం అంటూ అలానే వ్యవహరిస్తున్నారు. ఇతర కులం/ మతం వారు అంటే అంతే. అంతేకాదు తమ కూతురు ప్రేమించారనుకో ఇక అంతే.. ఎక్కడ లేని కోపం వస్తాయి. పగ, ప్రతీకారం కూడా చూపిస్తారు. కొందరు చంపేందుకు కూడా వెనకాడరు. ఇలాంటి హత్యలు చాలానే జరిగాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో కూడా ఒకటి జరిగింది.

కూతురుతో ప్రేమ..
తన కూతురుని ప్రేమించాడనే కోపంతో చిత్తూరు జిల్లాలో ఒక యువకుడిని యువతి తండ్రి హత్య చేశాడు. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువకుడు శవమై తేలాడు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంట గ్రామానికి చెందిన దనశేఖర్ ...అదే గ్రామానికి చెందిన శైలజ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం ఇంట్లో తెలిసింది. ఇంకేముంది యువతి తరపు వారు మాత్రం పెళ్లికి అంగీకరించలేదు.

డ్రైవర్‌గా పనిచేస్తూ..
దనశేఖర్ బెంగుళూరులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి ఆదృశ్యమయ్యాడు. కొడుకు కనపడకపోయే సరికి దనశేఖర్ తల్లితండ్రులు సోమవారం పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.విచారణలో దనశేఖర్ ను యువతి తండ్రి బాలు హత్యచేసి సొంత పొలంలో పూడ్చి పెట్టినట్లు గుర్తించారు.
Recommended Video

నాలుగు ముక్కలుగా శరీరం
బాలును అదుపులోకి తీసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని పాతి పెట్టిన ప్రదేశం నుంచి వెలికి తీశారు. దనశేఖర్ శరీరాన్ని నాలుగు ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాల్లో పాతిపెట్టినట్లు తెలిపాడు. కూతురుతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవటంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాలు తెలిపాడు. దీంతో పోలీసులు పరువు హత్యగా భావించి వివిధ సెక్షన్లకింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications