Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారికి శిరస్సు వంచి నమస్కరించిన మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నమయ్య రాయచోటి జిల్లాలోని పుంగనూరులో నిర్వహించిన రోడ్ షోలో సంభవించిన దాడుల తీవ్రత తగ్గట్లేదు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పోలీసులపై దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు 200 మందికి పైగా అరెస్ట్ అయినట్లు చెబుతున్నారు.

పుంగనూరులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించిన సమయంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడికి దిగిన విషయం తెలిసిందే. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో రణధీర్ అనే ఓ కానిస్టేబుల్ కంటికి తీవ్ర గాయమైంది. దీనితో ఆయన చూపు కోల్పోయారు.

Peddireddy Ramachandra Reddy

ఆ సమయంలో పోలీసులు సంయమనం పాటించారు. తమ చేతుల్లో ఆయుధాలు ఉన్నప్పటికీ.. కాల్పులకు దిగలేదు. రెచ్చిపోతున్న టీడీపీ కార్యకర్తలను టియర్ గ్యాస్ ప్రయోగించి అదుపు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. వారిని చెదరగొట్టడానికి గాల్లోకి గానీ లేదా వారిపై గానీ కాల్పులు జరపలేదు. జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి నుంచి ఖచ్చితమైన ఆదేశాలు రావడం వల్లే పోలీసులు సంయమనంతో వ్యవహరించారు.

కార్యకర్తలపై కాల్పులు జరిపివుంటే- టీడీపీ దాన్ని రాజకీయంగా వాడుకుని ఉండేదనే అభిప్రాయాలు వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి వ్యక్తం అయ్యాయి. టీడీపీ కార్యకర్తలు ఎంత రెచ్చగొట్టినా.. విచక్షణారహితంగా భౌతికదాడులు చేసినా పోలీసులు తమ పరిధికి లోబడే వారిని నియంత్రించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.

Chandrababu

ఆ సమయంలో పోలీసులు చూపిన సంయమనాన్ని జిల్లాకు చెందిన మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశంసించారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి టీడీపీ నాయకుల బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడారని వ్యాఖ్యానించారు. టీడీసీ దాష్టీకాలు మరింత పెచ్చరిల్లకుండా అదుపు చేయగలిగారని అన్నారు.

విధి నిర్వహణలో పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించారని ప్రశంసించారు. గాయపడ్డ పోలీసులను ఆయన పరామర్శించారు. వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి.. వారికి శిరస్సు వంచి నమస్కరించారు. దాడులను సకాలంలో అడ్డుకున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్‌కూ ధన్యవాదాలు తెలుపుకొంటున్నానని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+