ఎమ్మెల్యే రోజాకు థ్యాంక్స్: ప్రభుత్వ లోపాన్ని ఎత్తి చూపిన నగరి మున్సిపల్ కమిషనర్: సస్పెన్షన్ వేటు..

చిత్తూరు: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్, అనస్థీషియన్ డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్‌ మిగిల్చిన రాజకీయ ప్రకంపనలు సద్దుమణగక ముందే.. మరో ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. నాలుగు కేసులు పాజిటివ్‌గా తేలిన నగరి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవట్లేదని, కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదంటూ చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి విమర్శించారు.

 మొన్న డాక్టర్ సుధాకర్.. నేడు వెంకట్రామిరెడ్డి..

మొన్న డాక్టర్ సుధాకర్.. నేడు వెంకట్రామిరెడ్డి..

దీనికి సంబంధించిన ఓ సెల్ఫీ వీడియోను ఆయన సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వంటి ఉల్లంఘన చర్యలకు దిగినందున ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలనా శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ జీ ఎస్ఆర్‌కేఆర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వెంకటేశ్వర రావును ఇన్‌ఛార్జి కమిషనర్‌గా నియమించారు.

 గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు..

గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు..


కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం ఎలాంటి నిధులను కూడా విడుదల చేయలేదని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. మాస్కులను కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేవని అన్నారు. నగరిలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కొందరు వ్యాపారస్తులు.. రోడ్ల మీద తిరుగుతూ, మాస్కులు, ఆహార పాకెట్లను పంచుతూ హడావుడి చేస్తున్నారని, ఈ సమయంలో కావాల్సింది అలాంటి చర్యలు కాదని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. స్వార్థాన్ని విడనాడి, చిత్తశుద్ధితో పని చేయాల్సిన సమయం ఇదేనని అన్నారు.

ఎమ్మెల్యేకు

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఆర్‌కే రోజాను వెంకట్రామిరెడ్డి ప్రశంసించారు. రోజా రోజూ అయిదు చొప్పున మండలాలకు భోజనం పెట్టిస్తున్నారని, అది కూడా లేకపోతే ఇంకెంత కష్టంగా ఉంటుందోనని అన్నారు. మహిళే అయినప్పటికీ.. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. మిగిలిన వాళ్లంతా తాము నాయకులం అని చెప్పుకొంటున్నారని, పేరు, గుర్తింపు కోసం ఎగబడతారని ఆరోపించారు. నాలుగు మాస్క్‌లు, నాలుగు ఆహార పాకెట్లు ఇచ్చిసి చేతులు దులిపేసుకుంటున్నారని విమర్శించారు. అధికారిక కార్యకలాపాలకు ఉద్దేశించిన అకౌంట్లను ప్రభుత్వం స్తంభింప చేసిందని, నిధుల కోసం అగచాట్లు పడుతున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+