చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం: పల్టీలు కొట్టిన కారులో మంటలు, ఐదుగురు సజీవ దహనం
చిత్తూరు: జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు-నాయుడపేట రహదారిపై చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపరాు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలాలర్పి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. కారు నెంబర్ ఏపీ 39హెచ్ఏ 4003గా గుర్తించారు. మృతులంతా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పేరాపురం వాసులుగా తెలిపారు.
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
జగిత్యాల జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జగిత్యాల-కోరుట్ల హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మోహన్ రావు పేట వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు అయ్యాయి. మృతులంతా కోరుట్ల మండలం మోమిన్ పూర్ కు చెందిన వారుగా గుర్తించారు. ఇద్దరు చిన్నారులతోపాటు డ్రైవర్ బాబు కూడా మృతి చెందారు. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పిల్లల తల్లీదండ్రులతోపాటు మరొక మహిళ ఉన్నారు.
Recommended Video
క్షతగాత్రులను చికిత్స కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. వీరిలో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి కోరుట్ల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మెట్‌పల్లి నుంచి జగిత్యాల వైపు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఇటు కోరుట్ల వైపు వెళ్తోన్న ఇన్నోవా కారు అతి వేగంగా వెళ్లి.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారే కాకుండా బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిని కూడా జగిత్యాల ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications