చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

న‌గ‌రిలో ఫ‌లితం పైన జ‌గ‌న్ అంచ‌నా ఏంటి: అదే రోజా ధీమాకు కార‌ణ‌మా: అస‌లేం జ‌రిగింది..!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఎన్నిక‌ల్లో గెలుస్తున్నారా..లేదా. కొన్ని స‌ర్వే సంస్థ‌లు రోజా గెలుపు పైన నెగ‌టివ్ అంచ‌నాలు ఇచ్చారు. వీటి పైన సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగింది. అయితే, ఈ ఉద‌యం రోజా తిరుమ‌ల‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆ త‌రువాత తన గెలుపు..రాష్ట్రంలో వైసీపీ విజ‌యం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేసారు. రాజ‌గోపాల్ చేసిన స‌ర్వే స్వార్ద పూరిత స‌ర్వే అంటూ ఫైర్ అయ్యారు. కానీ, రోజా ధీమా వెనుక జ‌గ‌న్ చేసిన విశ్లేష‌ణ‌..చెప్పిన ధైర్యం కార‌ణంగా తెలుస్తోంది.

రోజా గెలుపు పైన అనుమానాలు
న‌గ‌రి నుండి వైసీపీ అభ్య‌ర్దిగా రెండో సారి బ‌రిలోకి దిగిన రోజా గెలుపు పైన కొద్ది రోజులుగా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. పోలింగ్ జ‌రిగిన నాటి నుండి రోజా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు..మీడియాకు దూరంగా ఉంటున్నారు. రోజా న‌గ‌రిలో గెలుపు అంత సులువు కాద‌నే విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. వైసీపీ నేత‌లే కొంద‌రు రోజాకు వ్య‌తిరేకంగా ప‌ని చేసార‌ని..అదే స‌మ‌యంలో గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు మృతి సానుభూతి ఆయ‌న కుమారుడికి క‌లిసి వ‌చ్చింద‌న‌నే విశ్లేష‌ణ‌లు తెర మీద‌కు వ‌చ్చాయి.

దీంతో..రోజా సైతం సైలెంట్‌గా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే, మ‌రి కొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ స‌మ‌యంలో రోజా తిరుమ‌ల వేదిక‌గా తొలి సారి త‌న విజ‌యం మీద ధీమా వ్య‌క్తం చేసారు. తాను రెండో సారి గెల‌వ‌టం ..జ‌గ‌న్ అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌ని చెప్పుకొచ్చారు.

Roja confident on her victory in Nagari ..She says Jagan surely became CM..

జ‌గ‌న్ ధీమాతోనే ఈ ధైర్యం...
న‌గ‌రిలో పోలింగ్ స‌ర‌ళి పైన పార్టీ నేత‌లు రోజా గెలుపు పైన ధీమా వ్య‌క్తం చేయ‌లేదు. కొన్ని స‌ర్వే సంస్థ‌లు సైతం రోజా గెలుపు క‌ష్ట‌మ‌నే విశ్లేష‌ణ‌లు చేసారు. ఇదే స‌మ‌యంలో రోజా పోటీ చేసిన న‌గ‌రి పైన జ‌గ‌న్ మూడు సంస్థ‌ల‌తో లోతైన స‌ర్వే చేయించారు. సాధార‌ణ శైలిలో చేసే స‌ర్వేల‌కు భిన్నంగా వీటిని నిర్వ‌హించేందుకు కొన్ని సూచ‌న‌లు చేసారు. అయితే, ఆ స‌ర్వేల్లో న‌గ‌రిలో వైసీపీ అభ్య‌ర్ది రెండు శాతం ఓట్ల‌తో గెలుస్తార‌ని జ‌గ‌న్‌కు నివేదిక ఇచ్చారు.

దీంతో..జ‌గ‌న్ ఇదే విష‌యాన్ని రోజాకు చెప్పారు. ఇది తెలుసుకున్న రోజా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనుమానంగా ఉన్న త‌న గెలుపు అవ‌కాశాల పైన ఓపెన్ అయ్యారు. త‌న గెలుపు ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. డ్వాక్రా మ‌హిళ‌లు చంద్ర‌బాబును న‌మ్మ‌లేద‌ని చెప్పుకొచ్చారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వే స్వార్ద‌పూరితం అంటూ ఫైర్ అయ్యారు. దీంతో.. ఇప్పుడు వైసీపీ అభిమానులు న‌గ‌రి ఫ‌లితం పైన ఆస‌క్తిగా ఉన్నారు.

English summary
YCP Mla Roja first time confidently say about her victory in Nagari. Just few days back Jagan got feedback form survey agencies on Nagari Result. That report is in favour of YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X