చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ బర్త్‌డే నాడు రోజా దత్తత తీసుకున్న విద్యార్థిని నీట్‌లో గ్రేట్: మురిసిపోతున్న ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి శాసన సభ్యురాలు ఆర్ కే రోజా దత్తత తీసుకున్న ఓ విద్యార్థిని.. నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో అద్భుత ప్రతిభను చూపారు. రోజా కలలను నెరవేర్చారు. దీపావళి పండగ నాడు తనను చదవించిన రోజాకు మరిచిపోలేని కానుకను అందించారు. కార్పొరేట్ విద్యాసంస్థల స్థాయి విద్యార్థికి తీసిపోని విధంగా మార్కులను సాధించారు. అన్నీ తానై తనను చదివించిన రోజాకు గర్వించేలా చేశారు.

తిరుపతి గర్ల్స్

తిరుపతి గర్ల్స్

ఆ విద్యార్థిని పేరు పీ పుష్ప కుమారి. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు బాల్యంలోనే అనారోగ్య కారణాతో మరణించారు. తిరుపతిలోని గర్ల్స్ హోమ్‌లో ఆమె చదువుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన రోజా- ఆ గర్ల్స్ హోమ్‌ను సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయినిలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పుష్పకుమారి- తన లక్ష్యాన్ని రోజాకు వివరించారు. తాను మెడిసిన్ చదవాలని అనుకుంటున్నానని, అది చదివేంత ఆర్థిక స్థోమత, తల్లిదండ్రుల అండ తనకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ బర్త్‌డే నాడు దత్తత..

జగన్ బర్త్‌డే నాడు దత్తత..

పుష్పకుమారి జీవిత లక్ష్యాన్ని తాను నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు రోజా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21వ తేదీన పుష్పకుమారిని దత్తత తీసుకున్నారు. ఎంబీబీఎస్ చదివించడానికి అవసరమైన ఖర్చను భరిస్తానని భరోసా ఇచ్చారు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయేంతటి దుస్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకున్నారు. పుష్పకుమారిని తన సొంత ఖర్చులతో చదివిస్తానని పేర్కొన్నారు.

పేద విద్యార్థి అత్యున్నత చదువుల కోసం..

పేద విద్యార్థి అత్యున్నత చదువుల కోసం..

రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి అత్యున్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో అమ్మఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌లో విద్యాబోధన, నాడు-నేడు వంటి పథకాలను అమలు చేస్తోన్న వైఎస్ జగన్ వంటి మంచి మనిషి జన్మదినాన పుష్పకుమారిని దత్తత తీసుకుంటున్నానని చెప్పారు. జగనన్న బర్త్ డేకి ఆయన చెల్లెలిగా పుష్ప కుమారిని చదివించడానికి నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పారు. రోజా చేసిన మంచిపని పట్ల అప్పట్లో సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. ః

89 శాతం మార్కులు..

89 శాతం మార్కులు..


ఇప్పుడు అదే విద్యార్థిని.. నీట్‌లో గ్రేట్ అనిపించుకున్నారు. 89 శాతం మార్కులను సాధించారు. ఈ విషయాన్ని రోజా వెల్లడించారు.
మంచి మనిషి జన్మదినాన తాను చేసిన మంచి పని వృధా పోలేదని సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ డాక్టర్ కావాలనే తన ఆశయాన్ని వదులుకోలేదని, దాని సాధించారని అన్నారు. పిల్లలు చదువుకోవాలి.. ప్రతి ఆడపిల్ల తప్పనిసరిగా విద్యాపరంగా ఎదగాలి అని నమ్మే జగనన్న జన్మదినం సందర్భంగా ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకున్నానని గుర్తు చేశారు.

బొకెలతో సరిపెట్టుకోలేదు..

బొకెలతో సరిపెట్టుకోలేదు..


జగనన్నకు బొకేలు మాత్రమే ఇవ్వకుండా ఒక బంగారు తల్లి భవిష్యత్తుకి బాట వెయ్యడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతో మంది చిన్నారులకు మేనమామగా మారిన మన జగనన్నకు ఇదే నా పుట్టినరోజు బహుమతి.. హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ ఓ ప్రకటనను రోజా విడుదల చేశారు. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా గత ఏడాది తాను దత్తత తీసుకుని చదివిస్తున్న చిన్నారి పుష్ప నీట్ లో 89% మార్కులు సాధించందని, తన పుట్టిన రోజుకు కానుకగా ఇచ్చిందని రోజా పేర్కొన్నారు.

English summary
YSRCP MLA Roja's adopte girl Pushpa bags 89 percent in Neet 2021,gives a diwali gift.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X