సీఎం జగన్ కమిట్మెంట్ కు ఫిదా - ప్రశంసలు..!!

ముఖ్యమంత్రి జగన్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు భరోసా ఇచ్చారు. అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. తాను తుఫాను సమయంలో ఇచ్చిన ఆదేశాలు ఏ విధంగా అమలైందీ ప్రజలనే అడిగి తెలుసుకున్నారు. పరిహారం పంపిణీ పైన ఆరా తీసారు. ఇదే సమయంలో జగన్ పర్యటన సమయంలో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా..ఇప్పుడు సీఎం గా జనంలో జగన్ కు ఎందుకు ఆదరణ అనేది వైరల్ అవుతోంది.

మారుతున్న లెక్కలు
ఎన్నికల వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలతో మమేకం అయిన తీరు ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ఎక్కడ ఫొటోలు.. ప్రచార ఆర్భాటాలకు అవకాశం లేకుండా జగన్ పర్యటన సాగింది. వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్ళిన ఆయన హెలీకాఫ్టర్ దిగుతునే కలెక్టర్ తో ఫోన్ లో సంభాషించారు.

CM YS Jagan assured financial assistance and other relief measures to Cyclone effected victims

ఎంతమంది బాధితులకు 2500 రూపాయలు పరిహారం అందించారు, ఎన్ని కుటుంబాల వారికి నిత్యావసరాలు అందజేశారని వాకబు చేశారు. తుఫాను పైన నిరంతరం సమీక్షలు చేసిన ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సహాయక శిబిరాల నుంచి వెళ్లే వారికి రూ 2500 ఇవ్వాలని ఆదేశించారు.

బాధితులకు అండగా
తాను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినపుడు బాధితులను సహాయ కార్యక్రమాల గురించి ఆరా తీస్తానని చెప్పినట్లుగానే వారిని స్వయంగా కలిసి మాట్లాడారు. కొందరు స్థానికులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే సీఎం జగన్ స్పందించారు.అవసరమైన వారికి తక్షణ సహాయం అందించారు. ఇద్దరు మహిళలకు లక్ష రూపాయల చొప్పున తక్షణ సహాయం చేశారు.

CM YS Jagan assured financial assistance and other relief measures to Cyclone effected victims

ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఫొటో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి జగన్ కాలికి కొద్ది రోజుల క్రితం గాయం అయింది. ఆ నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదు. ప్రస్తుతం కాలికి బ్యాండేజ్ ..నొప్పితోనే సీఎం జగన్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆ ఫొటో ఇప్పుడు వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. ఇదీ జగన్ కమిట్మెంట్ అంటూ అభినందిస్తున్నారు.

ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.2,500 చొప్పున అందించారు. సహాయక కార్యక్రమాల్లో వాలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరించారు. పునరావాస కేంద్రాలకు రాని బాధిత కుటుంబాలకు సైతం ఈ ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

10 వేల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయగా మిగిలిన కుటుంబాలకు కూడా అందించాలని కలెక్టర్లను సూచించారు. మిచాంగ్‌ తుపాను 15 జిల్లాల పరిధిలో 240 మండలాల్లోని 2,068 గ్రామాలపై ప్రభావం చూపినట్లు తేలింది. ఆయా గ్రామాల్లో బాధితుల కోసం 494 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 31,628 మందికి ఆశ్రయం కల్పించారు. తడిచిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+