భీమవరంలో డబ్బులు పంచారు..బ్లాక్ టిక్కెట్లు అమ్మలేదా : పవన్ పై ఆమంచి సంచలన వ్యాఖ్యలు..!
జనసేన అధినేత పవన్ కళ్యాన్ పైన వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ ప్రజల కోసం ఏదో వదులుకొని వచ్చానని చెబుతున్నారని..ఆయన మేకప్ వేసుకుంటే హీరో.. తీసేస్తే జీరో అంటూ కామెంట్ చేసారు. భీమవరంలో పవన్ గెలుపు కోసం సూర్యారావు అనే వ్యక్తి డబ్బులు పంచలేదా అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం సమయంలో పవన్ ప్రచారం చేసిన ప్రతీ చోట పార్టీ అభ్యర్ధులు ఓడి పోయారని గుర్తు చేసారు.
పవన్ రీల్ హీరో అయితే..సీఎం జగన్ రియల్ హీరో అని చెప్పుకొచ్చారు. నాడు కేశినేని లాంటి వారు ప్రజారాజ్యాన్ని నాశనం చేస్తే..ఇప్పుడు మనోహర్ లాంటి వారి గురించి పవన్ అభిమా నులు ఆందోళనతో ఉన్నారన్నారు. విశాఖ సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడటానికి లేవగానే జనసైనికులు అందరూ నిశ్వబ్దంగా ఉండిపోయారంటూ..దానికి కారణం వివరించారు. అచ్చెన్నాయుడు..అయ్యన్న ను పక్కన పెట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడటం పైన ఆమంచి ఫైర్ అయ్యారు.

పవన్ రీల్ హీరో..జగన్ రియల్ హీరో
సినిమాలు వదులుకొని ప్రజల కోసం వచ్చానని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఏం వదులుకొని వచ్చారని వైసీపీ నేత ఆమంచి ప్రశ్నించారు. ఆయన మేకప్ వేస్తే హీరో..తీసేస్తే జీరో అని చెప్పుకొచ్చారు. పవన్ రీల్ హీరో అయితే జగన్ రియల్ హీరో అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ విశాఖ సభలో చేసిన వ్యాఖ్యల దారుణంగా ఉన్నాయన్నారు. జగన్ పైన కేసులు పెట్టారనే కసితో ఆయన అన్నింటిని వదులుకొని తొమ్మిది ఏళ్లు కష్టపడి ప్రజలతోనే ఉంటూ అధికారం దక్కించుకున్నారని చెప్పుకొచ్చారు. పవన్ ఏం చేసారని..అసలు ఆయనకు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో తన బంధువులకు చంద్రబాబు భూములు కట్టబెడితే పవన్ ప్రశ్నించరా అని నిలదీసారు. బొత్సాను ఓడించేందుకు ప్రజారాజ్యం నుండి పవన్ పోటీ చేసినా అక్కడ బొత్సానే గెలిచారని గుర్తు చేసారు. నాగావళిలో ఇసుక దోచుకున్న అచ్చెన్న.. చిరంజీవిని దూషించిన విజయ్ తండ్రి అయ్యన్న ఇప్పుడు పవన్ కు కావాల్సి వచ్చారా అని ఆమంచి నిలదీసారు.

భీమవరంలో డబ్బులు పంచలేదా..
పవన్ కళ్యాణ్ భీమవరంలో గెలవటం కోసం సూర్యారావు అనే వ్యక్తి ద్వారా డబ్బులు పంపిణీ చేసారా లేదా అని ఆమంచి ప్రశ్నించారు. అదే విధంగా అజ్ఞాతవాసి టిక్కెట్లు బ్లాక్ లో అమ్ముకోలేదా అని నిలదీసారు.
24 ఏళ్ల కాలంలో ఇంత వరదలు ఎక్కడా రాలేదని..దీని కారణంగా నే ఇసుక కొరత ఏర్పడిందని..కొరత విషయాన్ని సీఎం సైతం అంగీకరించారని ఆమంచి చెప్పుకొచ్చారు. తెలంగాణలో సైతం ఇసుక సమస్య ఉందన్నారు. పవన్ కళ్యాణ్ మీద కొందరు ఆశలు పెట్టుకున్నారని వాటిని టీడీపీ తో కలవటం ద్వారా సాధించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పవన్ సైతం ఎందుకు గెలవలేక పోయారో గుర్తించాలని సూచించారు. పల్లెటూరుకు చెందిన ఆరోగ్యకరమైన అందమైన అమ్మాయిని ఏయిడ్స్ పేషెంట్ కు ఇస్తే ఎలా ఉంటుందో..ఇప్పుడు పవన్ వెళ్లి చంద్రబాబుతో కలిస్తే అంతే ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సినీ హీరోలు జగన్ వద్దకు రాకపోయినా.. వారు ఎప్పటికైనా రావాల్సిందేనని పేర్కొన్నారు. సినీ హీరోలు తమకు వచ్చే రెమ్యునరేషన్ వివరాలు ధైర్యంగా చూపించగలరా అని ప్రశ్నించారు.

మనోహర్ పైన కేడర్ లో అభద్రత..
విశాఖ సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడేందుకు లేవగానే అందరూ నిశ్వబ్దంగా ఉండిపోయారని..ఆయన మీద పవన్ అభిమానుల్లో అనుమానాలు ఉన్నాయని ఆమంచి వ్యాఖ్యానించారు. మనోహర్ బంధువు అయిన లింగమనేని రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు అని..ఇప్పుడు ఆయన ద్వారా పార్టీ నష్టపోతందనే భయం వారిలో ఉందన్నారు. ఇక, ప్రజారాజ్యం సమయంలో కేశినేని కారణంగా ఆ పార్టీ నష్ట పోయిందని ఆమంచి గుర్తు చేసారు. విజయ సాయిరెడ్డి ఒక మంచి ఆడిటర్ అని ఆయన గురించి పవన్ వ్యాఖ్యలు చేయటాన్ని ఆమంచి తప్పు బట్టారు.
-
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! -
రాజమండ్రి పరిసరాల్లో "పెద్ద పులి".. హనుమాన్ బృందాలకు పవన్ కీలక ఆదేశాలు !! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రిలీజ్.. -
'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షో టైమ్ లీక్.. ఇక రచ్చ రచ్చే.. -
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’












Click it and Unblock the Notifications