నాడు మహత్మాగాంధీ- ఇప్పుడు నేను: అనపర్తి నుంచే ఆట మొదలు: చంద్రబాబు వార్నింగ్

తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు.

కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఇవ్వాళ ఆయన అనపర్తికి వెళ్లారు. జీఓ నంబర్ 1 అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 రోడ్డుపై బైఠాయింపు..

రోడ్డుపై బైఠాయింపు..

ఈ సాయంత్రం చంద్రబాబు తన కాన్వాయ్ లో అనపర్తికి బయలుదేరి వెళ్లారు. 7 గంటలకు అనపర్తి దేవీ చౌక్ వద్ద బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించాల్సి ఉంది. దీనికోసం ఆయన జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు. అనపర్తిలో రోడ్ షో, బహిరంగ సభను నిర్వహించడానికి పోలీసులు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. జీఓ నంబర్ 1 అమలులో ఉండటం, గతంలో కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు సభల్లో సంభవించిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

 వెళ్లాల్సిందేనంటూ..

వెళ్లాల్సిందేనంటూ..

పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ- చంద్రబాబు మాత్రం దేవీ చౌక్ నుంచి మరో చోటికి తన బహిరంగ సభను నిర్వహించుకోవడానికి అంగీకరించలేదు. దేవీ చౌక్ లోనే సభను నిర్వహిస్తానంటూ పట్టుబట్టారు. పోలీసులు ఎలా అడ్డుపడతారో చూస్తానంటూ హెచ్చరించారు. అనపర్తి సుమారు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అయినప్పటికీ చంద్రబాబు తన కాన్వాయ్ ను ముందుకు కదిలించడానికి ప్రయత్నించారు.

రోడ్డుపై బైఠాయింపు..

రోడ్డుపై బైఠాయింపు..

ఈ సమయంలో పోలీసులు ఆయనను నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. జీఓ నంబర్ 1 అమలులో ఉందని వివరించారు. గతంలో కందుకూరు, గుంటూరు సభల్లో చోటు చేసుకున్న ప్రాణనష్టం గురించి చంద్రబాబుకు వివరించే ప్రయత్నం చేశారు. దీనికి ఆయన ఏ మాత్రం వినిపించుకోలేదు. పోలీసుల విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దీనితో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు రోడ్డుపైనే బైఠాయించారు. ఆయన కాన్వాయ్ ను ముందుకు కదలనివ్వలేదు.

 కాలి నడకన..

కాలి నడకన..

కాన్వయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాలినడకన అనపర్తికి బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట హోం శాఖ మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సహా కాకినాడ జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు. పోలీసులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నినాదాలు చేశారు.

పోలీసులు సంఘ విద్రోహశక్తులు..

పోలీసులు సంఘ విద్రోహశక్తులు..

అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు తాము సహాయ నిరాకరణ చేస్తామని, అనపర్తి నుంచి ఇది మొదలైందని అన్నారు. అప్పట్లో జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన దండి మార్చ్ తరహాలో ఇప్పుడు తాను అనపర్తి మార్చ్ను ప్రారంభించినట్లు ప్రకటించారు. నాడు బ్రిటీష్ ప్రభుత్వానికి మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ చేసినట్టే ఇప్పుడు తాను పోలీసులకు, జగన్ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులను సంఘ విద్రోహశక్తులుగా అభివర్ణించారు.

సమైక్యాంధ్రలో చరిత్ర సృష్టించా..

సమైక్యాంధ్రలో చరిత్ర సృష్టించా..

తాను 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేశానని, సమైక్యాంధ్రలో చరిత్ర సృష్టించానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎవ్వరూ కూడా తన రికార్డును బ్రేక్ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతగా ఉన్నానని, 27 సంవత్సరాలుగా అందరి అభిమానం పొందుతున్న టీడీపీ అధ్యక్షుడినని చంద్రబాబు తన గురించి తాను చెప్పుకొన్నారు. తాను పాకిస్తాన్ నుంచో, ఇతర దేశాల నుంచో తాను ఇక్కడికి రాలేదని, అనపర్తికి వచ్చే హక్కు తనకు లేదా? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+